ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!

ఏపి అసెంబ్లీ ఈ ట‌ర్మ్ చివ‌రి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌ర‌వ్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్ర‌భుత్వం సాధించిన అభివృద్దిని వివ‌రించారు. అదే స‌మ‌యంలో ల‌క్ష్యాల‌ను విశ్లేషించారు. రానున్న రోజుల్లో ఏపి ప్ర‌భుత్వం సంక్షేమం కోసం ఏర‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటుందో ప్ర‌క‌టించారు. కేంద్రం నుండి సాయం అంద‌టం లేద‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం కాపులకు

ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం కాపులకు

ఏపి ప్ర‌భుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11 శాతం వృద్ధిరేటు. 2050 నాటికి ప్రపంచంలోనే ప్రముఖ ప్రాంతంగా ఏపీ ఉంది. ఆదరణ పథకం కింద వృత్తిదారులకు పరికరాలు ఇస్తు న్నామ‌ని గవర్నర్ చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లకు పన్నుమినహాయింపునిచ్చామని, నాలుగున్నరేళ్లలో విభజన సమస్య లు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ఏపీ విభజన అసంబద్ధంగా జరిగిందన్నారు. విభజన కారంగాణ ఏపీ ఎంతో నష్టపోయిందని, ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్ర మద్దతు లేకపోయినా అభి వృద్ధిలో దూసుకెళ్తున్నామని గవర్నర్ వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. 10శాతం ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం కాపులకు ఇవ్వబోతున్నామని, 2029 నాటికి ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. అనేక బీసీ ఫెడరేషన్లకు కార్పొరేషన్లుగా మారుస్తామని ప్ర‌క‌టించారు.

గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ ఏపి ప్ర‌భుత్వం : ఆర్డినెన్స్ తిర‌స్క‌ర‌ణ : ఆమోదించ‌కుంటే బిల్లు..!

2029 నాటికి రాష్ట్రం నెంబ‌ర్ వ‌న్ గా..

2029 నాటికి రాష్ట్రం నెంబ‌ర్ వ‌న్ గా..

గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. 2029 నాటికి ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుందని గవర్నర్ చెప్పుకొచ్చారు.టెక్నాలజీ సాయంతో సేవల్ని ప్రజలకు చేరువ చేస్తున్నామని, రాబోయే ఐదేళ్లకు సంపృత్త స్థాయి విజన్‌ రూపొందించామని ఆయన తెలిపారు. 90శాతం రాయితీతో పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు. పోల వరం ప్రాజెక్ట్‌కు గిన్నిస్‌ అవార్డు వచ్చిందని, రాష్ట్రానికి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని గవర్నర్‌ విమర్శిం చారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఫించన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి రూ. 2 వేలు ఇస్తా మ వెల్ల‌డించారు. 11 బీసీల కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 8 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చనున్నామని నరసింహన్ స్ప‌ష్టం చేసారు.

ప‌సుపు కుంకుమ కింద ప‌ది వేలు..

ప‌సుపు కుంకుమ కింద ప‌ది వేలు..

ఇక‌, కొద్ది రోజుల క్రితం ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌టించారు. రూరల్, అర్బన్ హౌసింగ్ స్కీమ్ అమలు చేస్తున్నామ‌ని.. పసుపు-కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తున్నా మ‌ని వెల్ల‌డించారు. రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నాం. త్వరలోనే రెండు విడతల్లో రుణమాఫీకి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తయారుచేస్తున్నాం. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. నదుల అనుసంధానం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాఅంటూ గవర్నర్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. మొత్తం 99 అంశాల‌తో 40 పేజీల ప్ర‌సంగం 58 నిమిషాల పాటు కొన‌సాగింది. స‌భ‌కు వైసిపి గైర్హాజ‌ర‌యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+