• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ ఏపి ప్ర‌భుత్వం : ఆర్డినెన్స్ తిర‌స్క‌ర‌ణ : ఆమోదించ‌కుంటే బిల్లు..!

|
  Governor Narasimhan Rejected Ap Govt Ordinance On Dot Lands | Oneindia Telugu

  మ‌రోసారి ప్ర‌భుత్వం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ గా ప‌రిస్థితి మారుతోంది. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హార శైలి పై తొలి నుండి అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న ఏపి ప్ర‌భుత్వం మ‌రో సారి ఆయ‌న తీరు పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌భుత్వం పంపిన ఆర్దినెన్స్ ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించ‌క‌పోటం పై ప్ర‌భుత్వ పెద్ద‌లు అస‌హ‌నంతో ఉన్నారు. దీని పై ముఖ్య‌మంత్రి సైతం స్పందిస్తూ గ‌వ‌ర్న‌ర్ కు ప‌రిధులుండాల‌ని వ్యాఖ్యానించారు.

  గ‌వ‌ర్న‌ర్ తో అంతంత‌మాత్రంగా..

  గ‌వ‌ర్న‌ర్ తో అంతంత‌మాత్రంగా..

  రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత గ‌వ‌ర్న‌ర్ కొన‌సాగింపు పై బిజెపి కి మిత్రిప‌క్షంగా ఉన్న టిడిపి అంగీక‌రించింది. ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా న‌ర‌సింహ‌న్ ను కొనసాగించాల‌ని నిర్ణ‌యించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రితో విబేధాలు మొద‌లు అయిన త‌రువాత న‌ర‌సింహ‌న్ కేసీఆర్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపి ప్ర‌భుత్వం ఆరోపించింది. ఏపి సచివాల యం ఖాళీ చేయించే విష‌యంలోనూ ఏపి ప్ర‌భుత్వం పై గ‌వ‌ర్న‌ర్ ఒత్తిడి తెచ్చారనే వాద‌న ఉంది. ఏపి - తెలంగాణ కు సంబంధించిన స‌మస్య‌ల ప‌రిష్కారంలోనూ గ‌వ‌ర్న‌ర్ తెలంగాణ కే మేలు చేసేలా వ్య‌వ‌హ‌రించార‌ని ఏపి ప్ర‌భుత్వం లోని కీల‌క నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక‌, వివాదాల ప‌రిష్కారం లో గ‌వ‌ర్న‌ర్ చొర‌వ చూపించ లేద‌ని..కేవ‌లం ఒక్క సారి మాత్ర‌మే ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఏర్పాటు చేయ‌టం పైనా విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌, ఎన్డీఏ నుండి టిడిపి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత గ‌వ‌ర్న‌ర్ త‌మ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టిడిపి నేత‌ల వాద‌న‌.

  న‌ర‌సింహ‌న్ తీరు పై నేరుగా విమర్శ‌లు..

  న‌ర‌సింహ‌న్ తీరు పై నేరుగా విమర్శ‌లు..

  ఇక‌, గ‌వ‌ర్న‌ర్ గా న‌ర‌సింహ‌న్ తీరు పై ఏపి ప్ర‌భుత్వంలోని ముఖ్యులు నేరుగా విమ‌ర్శ‌లు చేసారు. కొద్ది కాలం క్రితం ఏపి ప్ర‌భుత్వం జారీ చేసిన నాళా చ‌ట్టానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం చెప్ప‌లేదు. దీంతో..ఏపి ప్ర‌భుత్వం ఆస‌హ‌నం వ్య‌క్తం చేసిం ది. ఇక‌, స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ నియామ‌కం విష‌యంలోనూ గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసారు. ఇక‌, జ‌గ‌న్ పై విశాఖ విమానాశ్ర‌యంలో దాడి జ‌రిగిన స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ నేరుగా డిజిపికి ఫోన్ చేసి మాట్లాడ‌టం పై ఏపి ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా..గ‌వ‌ర్న‌ర్ నేరుగా డిజిపికి ఫోన్ చేయా ల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ప్ర‌భుత్వం చుక్కల భూముల వ్య‌వ‌హారంలో జారీ చేసిన రెండు ఆర్డినెన్స్‌ల్లో ఒక దాన్ని గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించారు. దీంతో..ఇప్పుడు ముఖ్య‌మంత్రి సైతం తీవ్రంగా స్పందించా రు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారంతో గ‌వ‌ర్న‌ర్‌- ఏపి ప్ర‌భుత్వం మ‌ధ్య పెరుగుతున్న గ్యాప్ ను స్ప‌ష్టం చేస్తోంది.

  గ‌వ‌ర్న‌ర్ కు ప‌రిధిలుండాలి : ముఖ్య‌మంత్రి

  గ‌వ‌ర్న‌ర్ కు ప‌రిధిలుండాలి : ముఖ్య‌మంత్రి

  చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ నరసింహన్ తిరస్కరించారు. సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్‌ లేదని ప్రభుత్వానికి సూచించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను తప్పబడుతూ రెండు ఆర్డినెన్స్‌ల్లో ఒకటిని తిర స్కరించారు. ఇక 2 నెలల పరిష్కార సమయం పెట్టడాన్ని కూడా గవర్నర్‌ తప్పుబట్టారు. కేవలం అసైన్‌మెంట్‌ ఆర్డినె న్స్ను మాత్రమే ఆమోదించారు. దీంతో ఫిబ్రవరి 6న చుక్కల భూముల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని భావించిన ప్రభు త్వం పునరాలోచనలో పడింది. ఇదే విష‌యాన్ని ప్ర‌భుత్వ అధికారులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. గ‌వ‌ర్న‌ర్ ఇంకా ఆర్డినెన్స్ కు ఆమోదం తెల‌ప‌లేద‌ని వివ‌రించారు. స్పందించిన ముఖ్య‌మంత్రి ఆర్డినెన్స్ కు ఆమోదం తెల‌ప‌క పోతే..బిల్లు పంపుదామ‌ని వ్యాఖ్యానించారు. గ‌వ‌ర్న‌ర్ల అధికారాల పై ఎంతో కాలంగా విమ‌ర్శ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రి తాజాగా..గ‌వ‌ర్న‌ర్ కు పరిధిలుండాల‌ని వ్యాఖ్యానించారు.

  English summary
  Governor narasimhan Rejected Ap Govt ordinance on dot lands. Now this became once again Govt vs Governor in AP. CM Chandrababu also respond on this issue. He says if governor not accepts ordered to put it as bill in assembly.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X