NTR Vaidya Seva: డబ్బులిస్తేనే వైద్యం-ఏపీ సర్కార్ కు తేల్చేసిన ఆస్పత్రులు..!
ఎన్టీఆర్ వైద్య సేవ (NTR Vaidya Seva)నెట్ వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా, ప్యాకేజిల రేట్లు పెంచకుండా యూనివర్సల్ హెల్త్ స్కీంలో భాగస్వామ్యమయ్యేందుకు, సంతకాలు చేయటానికి, సేవలందించేందుకు సిద్ధంగా లేమని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్రప్రభుత్వానికి తేల్చిచెప్పేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతూ, చాలా నెలలుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి తమ ఆవేదన తెలుపుతున్నా..ప్రయోజనం లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఆస్పత్రుల కార్యవర్గం విజయవాడలో నిర్వహించిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాత బకాయిలను ఎప్పుడు తీరుస్తారో, ఎలా తీరుస్తారో కూడా చెప్పకుండా యూనివర్సల్ హెల్త్ స్కీంను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆషా నిరసన తెలిపింది. యూనివర్సల్ హెల్త్ స్కీంను ఎలా రూపొందించారో తమకు తెలియదని, అసలు తమను భాగస్వాములను చేయలేదని ఆరోపించింది. యూనివర్సల్ హెల్త్ స్కీం రూపకల్పనలో శాస్త్రీయత లోపించిందని, ఆచరణకు సాధ్యం కాని విధానంలో యుహెచ్ సి రూపకల్పన జరిగిందని తెలిపింది.

కేంద్రప్రభుత్వ పథకంలో కన్నా మెరుగ్గా ప్యాకేజీల రేట్లను అమలుచేస్తున్నట్టు చెబుతున్నారని, వాస్తవానికి ఇది సరికాదన్నారు. కేంద్రప్రభుత్వ పథకం కేవలం 20 శాతం నుండి 30శాతం ప్రజలకు మాత్రమే వర్తిస్తుందని, కానీ రాష్ట్రప్రభుత్వ పథకం ప్రస్తుత విధానంలో 100శాతం ప్రజలకు వర్తిస్తుందన్నారు. అలాంటపుడు సహజంగానే ప్యాకేజీల రేట్లు కొంత మెరుగ్గా ఉంటాయన్నారు. అయినా సరే కొన్ని సర్జరీల విషయంలో చేతి చమురు వదులుతోందన్నారు.ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ఆరోగ్యశ్రీ ఏ పేరు పెట్టినా గానీ, ఈ పథకాల్లో 25లక్షల వరకు వైద్య సహాయాన్ని పొందవచ్చని ప్రజలకు ప్రభుత్వాలు చెబుతున్నాయని, ఇది ప్రజలు నమ్మి ఆసుపత్రులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications