ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చూడుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా పంచాయతీల పునర్‌వర్గీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న పంచాయతీ వర్గీకరణ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు Andhra Pradesh Panchayat Raj Department అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

దీంతో ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఈ మార్పుల్లో ముఖ్యమైన అంశం 'రూర్బన్ పంచాయతీ' అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టడం. రూరల్ మరియు అర్బన్ లక్షణాలు కలిసిన పెద్ద గ్రామాలను గుర్తిస్తూ ఈ కేటగిరీని రూపొందించారు. పట్టణాల మాదిరిగా వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ap-government-lead-by-cm-chandrababu-key-decision-about-administration-of-village-panchayats

రూర్బన్ పంచాయతీ..

కొత్త విధానం ప్రకారం 10 వేల కంటే ఎక్కువ జనాభా మరియు రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 5 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాలకు ఈ కేటగిరీ వర్తిస్తుంది. ఈ పంచాయతీలలో రహదారులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజ్, వీధి దీపాలు వంటి పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనున్నారు.

గ్రేడ్-1 పంచాయతీ..

3 వేల నుంచి 10 వేల మధ్య జనాభా మరియు రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి లోపు వార్షిక ఆదాయం ఉన్న గ్రామాలు ఈ గ్రేడ్‌లోకి వస్తాయి. గిరిజన ప్రాంతాల్లో అయితే 2,500 నుంచి 5 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలు ఈ కేటగిరీలో చేరుతాయి. ముఖ్యంగా మండల కేంద్రంగా ఉన్న గ్రామాలు ఎక్కువగా ఈ గ్రేడ్‌లో ఉంటాయి.

గ్రేడ్-2 పంచాయతీ..

2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-2 కేటగిరీలో చేర్చారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 1,500 నుంచి 2 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలు ఈ వర్గంలోకి వస్తాయి. చిన్న గ్రామాలకు అవసరమైన ప్రాథమిక అభివృద్ధి పనులను ఈ కేటగిరీలో ప్రాధాన్యతగా చేపడతారు.

గ్రేడ్-3 పంచాయతీ..

1,500 కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాలను గ్రేడ్-3 పంచాయతీలుగా గుర్తించారు. జనాభా తక్కువగా ఉండే ఈ గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త వర్గీకరణతో పంచాయతీల అభివృద్ధి పనులు మరింత ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీకి ఉన్న జనాభా, ఆదాయం, అవసరాలను పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయించడం ద్వారా అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గ్రామాల్లో పెరుగుతున్న మౌలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డిజిటల్ సేవలు, గ్రామ స్థాయి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద గ్రామాలకు ఈ కొత్త రూర్బన్ పంచాయతీ వ్యవస్థ కీలకంగా మారనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+