నీతో ఫొటోనా: ట్రంప్ కు ఇచ్చిపడేసిన మెలోనీ..!

ఇటీవల ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో తనతో ఫొటో కోసం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రాధేయపడిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒక్క ఫొటో కోసం మెలోనీ తనను అడుక్కుందని అన్నారు. అయితే తాజాగా ఈ అంశంపై మెలోనీ స్పందించారు. ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా సృష్టించినవి.. ఇందులో నిజం లేదు అని మండిపడ్డారు. ఈ వ్యవహారం నేపథ్యంలో అమెరికాలో పర్యటించాల్సిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇటాలియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. జీ 7 సమ్మిట్ లో తాను మెలోనీతో మాట్లాడకూడదనే అనుకున్నాను.. కానీ ఆమెనే వచ్చి నాతో మాట్లాడారు. అందుకు సంతోషం.. అని ట్రంప్ అన్నారు. ఆ సమయంలో మెలోనీ తనతో ఓ ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించారు. అది కూడా బ్యాడ్ వేలో అందుకు తాను ఫొటో ఇవ్వనని చెప్పాను.. ఈ విషయంలో ఆమెకు సారీ చెప్పాను అని ట్రంప్ ప్రస్తావించారు. " నేను మాట్లాడినందుకు ఆమె సంతోషంగా ఉండే ఉంటుంది. అసలు తనతో మాట్లాడొద్దని నేను అనుకున్నాను. నాతో ఫొటో కోసం తను ప్రాధేయపడింది. నాతో బ్యాడ్ లీ గా ఫోటో దిగడం కోసం ప్రయత్నించింది. కానీ నేను తీసుకోలేదు. ఆ విషయంలో ఆమెకు సారీ చెబుతున్నాను" అని ఇటలీకు చెందిన లా7 టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.

Meloni Bold Response toTrump Italy Will Not Beg Anyone Shocking Statement Goes Viral MeloniTrump

అయితే ట్రంప్ వ్యాఖ్యలకు మెలోనీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు. ట్రంప్ తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదని గతంలోనూ ఇటలీ, ఇటలీ కూటమి దేశాలపై ట్రంప్ ఇలాగే మాట్లాడారని తెలిపారు. " డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం.. సొంత కూటమి దేశాలతో అమెరికా అధ్యక్షుడు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది మొదటిసారి కాదు.. గతంలోనూ చాలాసార్లు జరిగింది. వెస్ట్ లోని శత్రుదేశాలతో ట్రంప్ ఇలా వ్యవహరించరు. ఏదేమైనా నేను ఒకటి చెప్పదలచుకున్నా.. నేను, ఇటలీ ఎప్పుడూ అడుక్కోదు.." అని ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

మరోవైపు ట్రంప్ కామెంట్స్ తో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21,22 తేదీల్లో తన అమెరికా పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఇటలీలోని ఇతర మంత్రులు కూడా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+