ఓర్నీ.. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్న జనం.. వైరల్ వీడియో!
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో నిన్న సాయంత్రం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక క్రూడ్ ఆయిల్ షిప్ ను పేల్చి వేసింది. ఈ వార్త త్వరగా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత భయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు పరిగెత్తుతున్న జనాలు
గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా గ్యాస్ కొరత ఉంటుందన్న అనుమానంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి, గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు పరిగెత్తుతున్న వారి పరిస్థితి తాజా యుద్ధ వాతావరణానికి అద్దం పడుతుంది.

ప్రజలలో గ్యాస్ పట్ల మరింత భయాందోళన
దేశవ్యాప్తంగా అనేక చోట్ల గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరితే, కొన్నిచోట్ల ఏజెన్సీలలో చొరబడి సిలిండర్ లను ఎత్తుకుపోతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇది ప్రజలలో గ్యాస్ పట్ల మరింత భయాందోళనలను పెంచుతోంది.ఎల్పిజి గ్యాస్ కొరతపై బయట జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా ప్రభుత్వం ఎటువంటి కొరత లేదని చెబుతోంది.
ఖాళీ సిలిండర్ లతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు జనాల పరుగు
అయినప్పటికీ ప్రజలు మాత్రం గ్యాస్ సిలిండర్లను నిలువ చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో ఏజెన్సీ వద్దకు గ్యాస్ సిలిండర్ లతో ప్రజలు పరుగులు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వంట గ్యాస్ కొరత వార్తల నేపథ్యంలో పదుల సంఖ్యలో ప్రజలు ఎల్పిజి సిలిండర్లను పొందడానికి ఖాళీ సిలిండర్ లతో పరుగులు తీశారు.
వైరల్ అవుతున్న గ్యాస్ ఏజెన్సీ వీడియో
పంపిణీ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో గుమికూడి ఒకరినొకరు తోసుకుంటూ క్యూలైన్ ఏర్పాటు చేసుకోవడానికి నానా తంటాలు పడుతూ కనిపించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, గ్యాస్ కొరత పట్ల ప్రజలలో ఉన్న తీవ్ర ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు దేశంలో గ్యాస్ కొరత లేదని పదే పదే చెబుతున్నప్పటికీ, ప్రజలలో మాత్రం ఆందోళన పోవడం లేదు అని చెప్పడానికి ఉత్తరప్రదేశ్లోని కొన్ని గ్యాస్ ఏజెన్సీల వద్ద చోటు చేసుకుంటున్న సంఘటనలే ఒక ఉదాహరణ.












Click it and Unblock the Notifications