రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !!

సినిమా కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ నటీనటులు ఓవర్ గా కామెంట్స్ చేస్తున్న ఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఆ తర్వాత వ్యవహారం రచ్చగా మారడం లేదా సంబంధిత వ్యక్తులు ఆ విషయంపై రియాక్ట్ అవ్వడంతో సైలెంట్ గా సారీ చెప్పేయడం పరిపాటిగా మారింది. అయితే ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇటీవల నోరు జారడం అలవాటుగా చేసుకున్నారా అనే అనుమానం కలుగుతోంది.

గతంలో డేవిడ్ వార్నర్ ను దొంగ ము** కొడుకు, రేయ్ అంటూ వ్యాఖ్యానించి అనవసరంగా చిక్కుల్లో పడ్డారు. ఆ తర్వాత నటుడు అలీపై, బ్రహ్మానందంపై సభా ముఖంగానే కామెంట్స్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కానీ ఆ తర్వాత మళ్లీ యథావిధిగా సారీ చెప్పడం వంటివి జరిగిపోయాయి. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా తనదైన నటనతో ఆడియన్స్ ని అలరిస్తున్న సీనియర్ నటుడి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు పదే పదే వస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది.

hero-vishal-post-on-actor-rajendra-prasad-demanding-sorry-for-his-comments-about-mgr-goes-viral-on-m

కాగా రీసెంట్ గానే కత్తి కాంతారావు జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ లెజెండరీ నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్ పై చేసన కామెంట్స్ దుమారాన్ని లేపుతున్నాయి. కాంతారావు జానపద చిత్రాలను అప్పట్లో పడి పడి చూసేవారని చెప్పుకొచ్చారు. కాంతారావుని చూస్తే ఎంజీఆర్ వణికిపోయేవారని.. ఉ* పోసుకుంటూ వెళ్లిపోయేవారని మాట్లాడారు. అయితే రాజేంద్రప్రసాద్ ఉపయోగించిన పదజాలంపై తమిళ తంబీలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే విశాల్ సైతం సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

హీరో విశాల్ ఫైర్ ..

ఈ మేరకు ఆ పోస్టులో.. తెలుగు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ఇటీవల ఒక ప్రోగ్రాంలో మాట్లాడిన మాటలు చూసి నేను చాలా బాధపడ్డాను. తమిళనాడులో ఎంజీఆర్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. ఆయన మా అందరికీ ఒక గొప్ప దైవం లాంటి నాయకుడు. మీరు మరో గొప్ప నటుడు కాంతారావు గురించి గొప్పగా చెప్పడం మంచి విషయమే.. కానీ ఒకరిని పొగడడానికి మరొకరిని కించపరచడం కరెక్ట్ కాదు. ఆయన గురించి మీరు తక్కువ చేసి మాట్లాడడం మాకు నచ్చలేదు. ఇది తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.

మీలాంటి ఒక గొప్ప నటుడికి ఈ విషయం చెప్పడం నాకు బాధగా ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో చెబుతున్నాను. మీరు పెద్ద మనసుతో మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణలు చెప్పి, ఈ నివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీ స్థాయి ఉన్న నటులను ఎవరైనా ఇలాగే తప్పు చేసి మాట్లాడితే.. మీ కోసమైనా సరే ఇలాగే స్పందిస్తాను. మీరు తప్పకుండా క్షమాపణ చెప్పండి" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజేంద్రప్రసాద్ సినీ కెరీర్..

నటకిరీటి రాజేంద్రప్రసాద్ దశాబ్దాలుగా తనదైన నటనతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ముందుగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత చిన్న చిన్న పాత్రలు, ఆపై క్యారెక్టర్ రోల్స్... అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారారు. తన కెరీర్‌లో 200కు పైగా సినిమాల్లో నటించగా.. అందులో ఎన్నో సూపర్ హిట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు సహాయ నటుడి పాత్రలతో కొనసాగుతున్నారు. అయినప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+