జనాభా పెంచండి..చంద్రబాబు నినాదం: దేశ వ్యాప్త చర్చ : ఎవరి వాదన నిజం..!
మనం ఇద్దరు..మనకు ఇద్దరు. దేశంలో ప్రముఖులు జనాభా నియంత్రించుకోవాలని ఎప్పటి నుంచో సూచిస్తూ ప్రచారం చేసిన నినాదం ఇది. ఇప్పటికీ దేశంలోని కొందరు ప్రముఖులు ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే, ఏపి సీ యం చంద్రబాబు మాత్రం విరుద్దంగా సలహాలు ఇస్తున్నారు. చైనా -జపాన్ దేశాల్లో ఉన్న పరిస్థితులను వివరిస్తూ.. జనాభా పెంచటానికి ప్రయత్నం చేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఇది దేశ వ్యాప్త చర్చకు కారణమైంది..

పెళ్లిళ్లు చేసుకోండి..పిల్లలను కనండి..
సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కుటుంబ నియంత్రణ ఏపి అగ్రగామిగా ఉంది. రాష్ట్ర విభ జన తరువాత ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన విధానంలో మార్పు వచ్చింది. ఏపి లో పెట్టుబ డుల ఆకర్షణ కోసం ముఖ్యమంత్రి జపాన్..చైనా లో పర్యటనలు చేసారు. అక్కడి నుండి వచ్చిన తరువాత ఈ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 2015 నుండి నేటి వరకు ఇదే అంశాన్ని ప్రజలకు పిలుపునిస్తున్నారు .

యువత పెళ్లి చేసుకోవటానికి నిరాకరిస్తున్నారు.
చైనా - జపాన్ లో కుటుంబ నియంత్రణ కారణంగా యువత శాతం తగ్గిపోయిందని..వయసు మళ్లిన వారి పైనే ఆధార పడాల్సి వస్తోందని విశ్లేషిస్తున్నారు. యువత పెళ్లి చేసుకోవటానికి నిరాకరిస్తున్నారని ..చేసు కున్న పిల్లలను కనటానికి వెనుకాడుతున్నారని సీయం చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మారిన పరిస్థితుల కు అనుగుణంగా మన దేశం లోనూ మార్పులు రావాలని సూచించారు. ప్రతీ జంట పిల్లలను కనాలని ఇద్దరు కాదు.. నలుగురు పిల్లలను కనాలని పిలుపునిస్తున్నారు. కనీసం ఒక్కరినైనా కనాల్సిందేనని గట్టిగా కోరుతున్నారు.

పిల్లల కోసం చట్టాల్లోనూ మార్పులు..
గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయటానికి అనర్హలు అనే నిబంధన ఉంది. ఏపి సీయం చంద్రబాబు కొద్ది రోజుల క్రితం జనాభా పెరుగుదల కోసం ఈ నిబంధనను తొలిగించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా స్ధానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటానికి ఇబ్బంది లేదని ప్రకటించారు. తాజాగా, డ్వాక్రా మహిళా సంఘాల సభలోనూ ముఖ్యమంత్రి ఇదే సూచన చేసారు. కుటుంబ అర్దిక స్థితి గతలు ఆధారంగా ఎక్కవ మంది పిల్లలు వద్దనే ప్రచారం ఎంతో కాలంగా దేశంలో ఉంది. దేశ జనాభా సైతం పెరిగిపోతుండటం పై ఆందోళన వ్యక్తం అవుతోంది. అయి తే, ఇప్పుడు చంద్రబాబు పదేపదే చెబుతున్న ఈ విషయం దేవ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. దేశం మొత్తంలో ఒక రకమైన పరిస్థితులు ఉంటే ఏపి ముఖ్యమంత్రి మాత్రం జనాభా పెంచాలని కోరుతున్నారు. దీంతో..చంద్రబాబు వాద నలో వాస్తవం ఎంత.. ఏ మేరకు ఇది సమాజానికి మేలు చేస్తుందనే అంశం పై చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications