అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజ‌య‌సాయి త‌ర్వాత ల‌క్ష్యం ఆయ‌నే..! బీసి బాణం పై వైసీపి గురి..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఎలాంటి రాజ‌కీయ వైరుద్యాలు లేని వ్య‌క్తి. బీసీల‌కు ఆయ‌నే దైవం. వాస్త‌వంగా కూడా అంతే. ఆయ‌నే.. బీసీ నేత ఆర్‌.కృష్ణ‌య్య. ఎల్‌బీ.న‌గ‌ర్ నుంచి టీడీపీ త‌ర‌పున గెలిచిన ఐదేళ్లు జ‌నాల‌ను పెద్ద‌గా వేధించ‌లేదంటారు. అలా అని ఏదైనా ప్ర‌జోప‌యోగం కోసం ప‌ని చేస‌రా అంటే అదీ లేదంటారు ఎల్బీ న‌గ‌ర్ వాసులు. బీసీ నేత‌గా విజ‌యం సాదించిన క్రిష్న‌య్య రాజ‌కీయాల్లో మాత్రం రాణించ‌లేక‌పోయారని ఆయ‌న గ‌త నియోజ‌క‌ర్గంలో చెప్పుకుంటారు. ఐన‌ప్ప‌టికి బీసి జ‌నోద్ద‌ర‌ణ అనే ప‌దం మాత్రం ఆయ‌న పెదాల‌ను అంటిపెట్టుకోనే ఉంటుంది. 2014లో సైకిల్ ఎక్కిన కృష్ణ‌య్య 2018లో టీడీపీ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డాడు. అదీ ఎల్‌బీన‌గ‌రే కావాలంటూ మొండికేయ‌టంతో అప్ప‌టికే అక్క‌డ ఇద్ద‌రు రెడ్ల మ‌ధ్య పోరు దృష్ట్యా వ‌ద్ద‌న్నారు. దీంతో ఆయ‌న రాత్రికి రాత్రే ఢిల్లీ చేరి ఏఐసీసీ అద్య‌క్షుడు రాహుల్‌ను క‌ల‌సి టికెట్ తెచ్చుకుని న‌ల్ల‌గొండ జిల్లా నుంచి బ‌రిలోకి దిగి రాజ‌కీయంగా ఓడిపోయారు.

he is the next target to Vijayasai reddy..! eye on the bc arrow..!!

ఇంత‌టితో తెలంగాణ‌లో రాజ‌కీయ పోటీల‌కు స్వ‌స్తిచెప్పిన‌ట్లుగానే ప్ర‌క‌టించారు. ఇప్పుడు మిగిలింది ఆంద్ర ప్ర‌దేశ్. ఎంతైనా ఆయ‌న krishnayya జాతీయ‌నేత కాబ‌ట్టి రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని వైసీపీ భావించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న కూడా వైసీపీ వైపు అనుకూలంగా అడుగులు వేస్తూ జ‌గ‌న్‌తో సామ‌ర‌స్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందుకోసం తెర వెన‌క విజ‌య‌సాయి రెడ్డి త‌న‌దైన శైలిలో ఎంతో శ్ర‌మించాల్సి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పైగా వైసీపీ నిర్వ‌హించే బీసీ గ‌ర్జ‌న‌లో కూడా కృష్ణ‌య్య పాల్గొంటారంటున్నారు. ఈ లెక్క‌న ఆర్ క్రిష్ణ‌య్య ఏపీలో రాజ‌కీయంగా మ‌రో సారి అదృష్టం ప‌రీక్షించుకుంటారేమో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ! మ‌రి ఇదే అంశం ప‌ట్ల కాంగ్రెస్‌, టీడీపీలు ఎలా స్పందిస్తాయ‌నేది కూడా ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేపుతోంది.

English summary
Krishayya is a nationalist and it seems that the YCP wants to use his services in the forthcoming elections. He is also in harmony with Jagan. Vijayasay Reddy has been forced to work hard in his style. Krishnaiah is also participating in the BC Garjana which administers the YCP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X