అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నీ మేనెజ్ చేస్తే ఎందుకు ఓడిపోయా.. చంద్రబాబు నాయుడు

|
Google Oneindia TeluguNews

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వివేకా హత్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా అందుకు తానే కారణం అని వైసీపీ నేతలు అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య విషయంలో తనపై ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సర్పంచ్‌ల అవగాహన సదస్సులో మాట్లాడారు.

కట్టుకథలు అల్లి

కట్టుకథలు అల్లి

వివేకా హత్యపై ఎన్నో కట్టుకథలు అల్లారని చంద్రబాబు ఆరోపించారు. అవినాష్ రెడ్డిని పిలిపించి రక్తం మరకలు తుడిపించానట.. వివేకాను హత్య చేసిన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగి రెడ్డి సహా చివరికి జగన్ రెడ్డి కూడా మన మనిషేనట అని కామెంట్ చేశారు. సీబీఐని కూడా నేనే ప్రభావం చేశానంటున్న వాళ్లు., చివరికి మొగుడు పెళ్లాం కాపురం చేసుకోపోయినా తనే కారణం అంటారేమో? సినిమా టిక్కెట్ల సమస్య, ఉద్యోగుల సమస్యకు నేనే కారణమట. ఇన్నింటిని నేనే మేనేజ్ చేయగలిగితే ఎన్నికల్లో ఎలా ఓడిపోతాను? బాబాయిని హత్య చేసిన వాడు రాజకీయాలకు అవసరమా? శిశుపాలుడికి కూడా 100 తప్పులు చేశాకే పాపం పండినట్లు, జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క అవకాశం ఇక చివరి అవకాశమేనన్నారు.

రెండు లక్ష్యాలు

రెండు లక్ష్యాలు

బాబాయ్ హత్య తో జగన్ రెండు లక్ష్యాలు నెరవేర్చుకున్నారు. హత్యతో వివేకాను అడ్డు తొలగించుకున్నారు, తనపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందారు. సీబీఐ విచారణ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారా లేదా? చివరికి ఇప్పుడు వివేకా కూతురిని కూడా తన పావు అంటున్నార చంద్రబాబు ధ్వజమెత్తారు.
అవినాశ్ రెడ్డి వచ్చి చూడు.. అని నేనే శివశంకర్ రెడ్డితో చెప్పించా.. రెండోరోజు ఆ పత్రికలో 'నారాసురవధ చరిత్ర'అని కూడా నేనే రాయించా. ఆ పేపర్‌కు కూడా నేనే ఎడిటర్‌ని.. ఏం కథలు అల్లారు అని పైరయ్యారు.

ఆస్పత్రి ఎవరిదీ..?

ఆస్పత్రి ఎవరిదీ..?

జగన్ రెడ్డి మామకు చెందిన ఆసుపత్రి వాళ్లను కూడా నేనే రమ్మని చెప్పి, వారితో బ్యాండేజీల కుట్లన్నీ వేయించా. ఏమి నాటకాలయ్యా! బాడీని తీసుకెళ్లేందుకు ఓ బాక్సు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రక్తం కనిపించకుండా ఉండేందుకు పూలు వేయించారని సీఐ చెప్పాడు. ఆ పూలు కూడా నేనే వేయించా. అక్కడ ఉండే వాళ్లందరూ మన మనుషులే కదా! శివశంకర్ రెడ్డి మన మనిషే, గంగిరెడ్డి మన మనిషే, సునీల్ యాదవ్ మన మనిషే, అవినాశ్ రెడ్డి కూడా మన మనిషే, చివరికి జగన్ రెడ్డి కూడా మన మనిషే! వివేకా కుమార్తె సునీత మన చేతిలో పావే, భారతి రెడ్డి కూడా ఇప్పుడు... ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు.

English summary
if iam manage everything why iam loss for elections. tdp chief chandrababu naidu asked to ap cm ys jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X