జగన్‌పై పవన్ మరోసారి ఫైర్: ఈ సారి హామీలు అంటూ ట్వీట్

ఏపీ సీఎం జగన‌పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శల జడివాన కొనసాగుతోంది. ఇటీవల రిపబ్లిక్ మూవీ ఫంక్షన్‌లో చేసిన కామెంట్లపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దానికి కాసేపటి క్రితమే పోసాని కృష్ణమురళి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అదీ అయ్యిందో లేదో.. పవన్ కల్యాణ్ మరోసారి ఫైరయ్యారు. జగన్ లక్ష్యంగా విమర్శలు కొనసాగించారు.

పవన్ పోస్ట్

పవన్ పోస్ట్

రెండురోజుల క్రింద రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌కు వచ్చి.. సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయాలపై పవన్ కల్యాణ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు. అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు అమలుకావడం లేదని ఫొటో రూపంలో పోస్టు చేశారు. మద్యపాన నిషేధం, ఉద్యోగాల భర్తీ, కరెంటు చార్జీలు, రాజధాని అంశం ఇలా వాగ్ధానాలను అందులో ప్రస్తావించారు. వాగ్దానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందని ఏ ఒక్కదానిని అమలు చేయడం లేదని ఆరోపించారు.

అప్పుల కుప్ప

అప్పుల కుప్ప


రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందని ఆరోపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్యలపై ట్విట్టర్‌ ద్వారా ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామనే హామీకి భిన్నంగా పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని చెప్పారు. అందువల్లే క్రైం రేట్ పెరుగుతుందని ఆయన విశదీకరించారు.

హామీలే..?

హామీలే..?


మద్యం ఆదాయాన్ని బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునేందుకు ఉపయోగించుకుంటోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కరెంట్ చార్జీలను తగ్గిస్తామని, ట్రూ అప్ ద్వారా అదనపు భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. ఏటా 6 వేల 500 పోలీసు ఉద్యోగాలను నోటిఫై చేస్తామని ఇప్పటివరకు 450 ఖాళీలను మాత్రమే గుర్తించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను కూడా 36కు పరిమితం చేసిందని, జాబ్‌ క్యాలెండర్‌, ఇసుక ధరలు, సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాల అమలు చేయడం లేదన్నారు. వాటన్నింటిపై ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తోందని విమర్శలు గుప్పించారు.

మోసం

మోసం

అధికారంలోకి వచ్చేవరకు ఒకలా.. అధికారం చేపట్టిన తర్వాత జగన్ మరోలా బిహెవ్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పేద ప్రజల మేలును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమం పేరుతో మోసాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు మరచి.. కొత్త కొత్తవి అమలు చేస్తామని చెప్పి మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+