వైసిపిలోకి బ్ర‌హ్మానంద‌రెడ్డి..నంద్యాల ఎంపీగా : క‌ర్నూలు జిల్లా నేత‌ల క్యూ : సినీ రంగ క‌ళ‌కారులు..!

ఎన్నిక‌ల వేళ వైసిపిలోకి చేరిక‌ల సంద‌డి పెరిగింది. ఈ ఒక్క రోజు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు..సినీ రంగానికి చెందిన క‌ళాకారులు వైసిపి లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు దాస‌రి బాల వ‌ర్ధ‌న రావు, చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి తో పాటుగా పారిశ్రామిక వేత్త‌లు పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి చేరారు.

వైసిపిలోకి క‌ర్నూలు జిల్లా నేత‌లు..

వైసిపిలోకి క‌ర్నూలు జిల్లా నేత‌లు..

క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖులు వైసిపి లో చేరారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి చేరారు. ఆయ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసిపి నుండి నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఉంది. బ్ర‌హ్మానంరెడ్డిని క‌ర్నూలు..నంద్యాల‌కు చెందిన వైసిపి నేత‌లు జ‌గ‌న్ వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. అయితే, ఆయ‌న‌కు ఎంపీగా అవ‌కాశం ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా.. జ‌గ‌న్ దీని పై అధికారికంగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఇక‌, మాజీ ఎమ్మెల్యే...ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి వైసిపి లో చేరారు. తాను ఎటువంటి ప‌ద‌వులు ఆశించ‌కుండా నిస్వార్థంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు చల్లా రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు.

జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా సినీ క‌ళాకారులు

జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా సినీ క‌ళాకారులు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. నటులు పృథ్వి, కృష్ణుడు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్‌సీపీలో చేరారు. జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్విని తదిరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు.

టిడిపి వీడి వైసిపి లోకి..

టిడిపి వీడి వైసిపి లోకి..

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం కు చెందిన మాజీ టిడిపి ఎమ్మెల్యే దాస‌రి బాల‌వ‌ర్ధ‌న రావు వైసిపి లో చేరారు. ఆయ‌న టిడిపికి రాజీనామా చేసారు. ఆయ‌న సోద‌రుడు దాస‌రి జై ర‌మేష్ ఇప్ప‌టికే జ‌గ‌న్ తో స‌మావేశ‌మై వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యిం చారు. ఆయ‌న విజ‌య‌వాడ లోక్‌స‌భ స‌భ్యుడిగా వైసిపి నుండి పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో గ‌న్న వ‌రం కు చెందిన దాస‌రి బాల వ‌ర్ధ‌న రావు తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ఉద్దేశంతో వైసిపిలో చేర‌టం లేద‌ని..జ‌గ‌న్ ఏ బాధ్య‌త ఇచ్చినా నిర్వ‌ర్తిస్తాన‌ని చెప్పారు. టిడిపిలో కొన‌సాగ‌లేకే పార్టీ వీడాన‌ని స్ప‌ష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+