ఏపీ పంచాయతీ ఫలితాలు: రెండో విడతలోనూ వైసీపీ హవా.. కానరానీ టీడీపీ
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పలితాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. 522 చోట్ల వైసీపీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాదించారు. ప్రతిపక్ష టీడీపీకి చెందిన క్యాండెట్లు 21 చోట్ల మాత్రమే గెలుపొందారు. జిల్లాలవారీగా అభ్యర్థుల గెలుపు వివరాలను పరిశీలిద్దాం.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 41 అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఖాతా తెరవలేదు. విజయనగరంలో వైసీపీ 64, టీడీపీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు. విశాఖపట్టణంలో వైసీపీ 22, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ 16, టీడీపీ 1 చోట గెలిచారు. పశ్చిమ గోదావరిలో వైసీపీ 15 చోట్ల గెలిచారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటివరకు ఖాతా తెరవలేదు.
Recommended Video


కృష్ణా జిల్లాలో వైసీపీ 32 చోట్ల టీడీపీ 4 చోట్ల గెలిచారు. గుంటూరు జిల్లాలో వైసీపీ 67, టీడీపీ 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో వైసీపీ 67, టీడీపీ 2 చోట్ల విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ 35 చోట్ల.. చిత్తూరులో వైసీపీ 61, బీజేపీ 1 చోట గెలిచారు. అనంతపురం జిల్లాలో 14 వైసీపీ, టీడీపీ 1 చోట గెలిచారు. కడపలో వైసీపీ 36, టీడీపీ 2, ఇతరులు 2 చోట్ల.. కర్నూలులో వైసీపీ 51, టీడీపీ 6 చోట్ల అభ్యర్థులు గెలిచారు.












Click it and Unblock the Notifications