మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉష శ్రీ చరణ్.. సీఎం జగన్‌పై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. మంచిరోజు చూసుకుని మరీ.. మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇవాళ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉషశ్రీ చరణ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో గల తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించారు. మహిళా పక్షపాత ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని మరోసారి తేల్చిచెప్పారు.

మహిళల సంక్షేమం..
మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, మహిళలకు ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని 50 శాతం రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని ఆమె కొనియాడారు. మహిళా సాధికారత అన్ని రంగాల్లో సాధించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ సూచనల మేరకు తన శాఖ పరిధిలో అద్భుత ఫలితాలు రాబట్టేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తోన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

నలుగురు మహిళలకు
ఇటీవల కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సారి నలుగురు మహిళలకు ప్రాతినిధ్యం కలిగింది. ఉష శ్రీ చరణ్, విడదల రజనీ, ఆర్కే రోజా, తానేటి వనిత ఉన్నారు. వీరందరికీ సీఎం జగన్ కీలక శాఖలు అప్పగించారు. మంత్రి పదవీలు పాత వారు 11 మందికి లభించాయి. కొత్తగా 14 మందికి అవకాశం లభించింది. ఎలాగూ అసంతృప్తులు ఉంటారు.. వారిని కూడా జగన్ బుజ్జగిస్తున్నారు. దాదాపు అందరినీ కూల్ చేశారు. నామినెటెడ్ పదవీ.. లేదంటే పార్టీ పదవీ ఇస్తామని చెబుతున్నారు.

రెండున్నరేళ్లకు
ముందుగా చెప్పినట్టు రెండున్నరేళ్లకు మంత్రివర్గం మార్పు జరిగింది. అయితే కొందరు పాతవారికి చోటు లభించింది. అవకాశం దక్కనివారు కాస్త ఇబ్బంది పడినా వాస్తవమే.. అయినప్పటికీ అందరికీ భవిష్యత్‌లో పదవులు దక్కుతాయని జగన్ భరోసా నిచ్చారు. సో అలా చాలా మంది కూల్ అయ్యారు. కీలక నేతలు రాజీనామా అని చెప్పినా.. జగన్ భేటీతో పరిస్థితి మారిపోయింది.












Click it and Unblock the Notifications