అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్త్ అవర్.. రాత్రి గంటపాటు నిర్వహణ, ఏపీ గవర్నర్ పిలుపు

|
Google Oneindia TeluguNews

విద్యుత్ వినియోగం, కర్భన ఉద్గారాలు వాడకంతో పర్యావరణానికి చేటు.. భూతల్లికి కూడా కీడు జరుగుతుంది. దీంతో ఏకో ఫ్రెండ్లీ వాడకం.. అంటే ఎలక్ట్రానిక్ వాహనాలు, విద్యుత్ వినియోగం తక్కువ యూజ్ చేయాలని పర్యావరణ వేత్తలు చెబుతుంటారు. అందుకోసమే ఎర్త్ అవర్ అని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుంటారు. ఇవాళ ఏపీలో ఎర్త్ అవర్ పాటించనున్నారు.

గంటపాటు ఎర్త్ అవర్

గంటపాటు ఎర్త్ అవర్

రాత్రి గం.8-30 నుంచి గం.9-30 వరకు ఎర్త్ అవర్ పాటిస్తారు. రాష్ట్రంలో గల అన్ని ఆఫీసులు, ఇళ్ళలో అవసరం లేని చోట్ల విద్యుత్‌ లైట్లను ఆర్పివేస్తారు. ఈ మేరకు 'ఎర్త్‌ అవర్‌' ప్రచారంలో పాల్గొనాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.

రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు

శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు విజయవాడ రాజ్‌భవన్‌ ఆవరణలో అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. రాత్రిపూట ఓ గంటపాటు కరెంటు నిలిపేస్తే.. పర్యావరణానికి, భూమికి మేలు జరుగుతుందని పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. కర్బన ఉద్గారాలు పెరుగుతుండటంతో పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూతాపం తగ్గించకుంటే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.

ఏటా మార్చి 26వ తేదీన..

ఏటా మార్చి 26వ తేదీన..

మార్చి 26న రాత్రి గంటపాటు విద్యుత్‌ సహా ఇతర రకాల ఇంధనాల వినియోగం నిలిపేసి భూమికి కొంతైనా ఉపశమనం కలిగించేందుకు 'ఎర్త్‌ అవర్‌'ను ప్రజా ఉద్యమంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామని వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ ఇండియా ఏపీ డైరెక్టర్‌ ఫరీదా తంపాల్‌ తెలిపారు. కాలనీలు, రెసిడెన్షియల్‌ అసోసియేషన్ల సహకారంతో ఎర్త్‌ అవర్‌ పై అవగాహన కల్పిస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలగజేసే అంశాలను తెలియజేసి భూతాపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

అప్పుడు నో

అప్పుడు నో

గత రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఎర్త్ అవర్ నిర్వహించలేదు. ఈ సారి ప్రభావం తగ్గడంతో చేస్తున్నారు. సో.. అందరూ కూడా ఎర్త్ అవర్ పాటించి విద్యుత్ వినియోగం ఆదా చేయాలి. దీంతో పర్యావరణానికి చాలా మేలు చేసినవారిమి అవుతాం అని మేధావులు అంటున్నారు. సో ఎవరి ఇళ్లలో వారు ఇలా ట్రై చేయాలని కోరుతున్నారు.

English summary
today night 8.30pm to 9.30pm earth hour in andhra pradesh. governor biswabhusan harichandan called to people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X