ఆస్తులను తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా..? పవన్ కల్యాణ్..
సమయం దొరికితే చాలు ఏపీ సీఎం జగన్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకిపారేస్తున్నారు. ఇవాళ మరోసారి ఫైరయ్యారు. వైసీపీ నేతలకు అరుపులు, కేకలు తప్ప సరిగా మాట్లాడడం రాదని ఆరోపించారు. ఆస్తులను తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికేనా ప్రజలు జగన్‌ను ఎన్నుకుందని ప్రశ్నించారు.
సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలని, నవరత్నాలు అనే ఉంగరం ఇస్తే.. ప్రజల ఆకలి తీరుతుందా? అని పవన్ కల్యాణ్ నిలదీశారు. చదువుకోవాల్సిన పదేళ్ల విద్యార్థి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు జన సైనికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

2024లో వైసీపీని ఓడించాలంటే జనసైనికుల్లో ఐక్యత ముఖ్యమని పవన్ కల్యాణ్ సూచించారు. మనం అంత ఐక్యంగా ఉంటేనే ఎదుర్కొగలం అని పేర్కొన్నారు. వర్ష బీభత్సంతో ఏపీలో కొన్ని జిల్లాలు అల్లాడుతుంటే.. సరైన సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రజల బాగోగులను పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని అడిగారు. ఎన్నికల సమయంలోనే వారు గుర్తొస్తారా అని ప్రశ్నించారు. మిగతా సమయంలో పట్టించుకోరని.. జనం గోడు పట్టదని మండిపడ్డారు.
Recommended Video
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేతల పర్యటన కొనసాగుతోంది. ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వ తప్పిదాలను విమర్శిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయం.. కల్లలో ఉన్న పంటకు నష్టం వాటిల్లింది. దానిని మద్దతు ధరకు కొనుగోలు చేస్తారా లేదా అనే అనుమానం కలుగుతుంది. కలర్ మారితే.. మద్దతు ధర వచ్చ అవకాశం ఉండదు. దీనిపై రైతులు పోరాటం చేస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అధికార పార్టీలు మాత్రం కబుర్లు చెబుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications