ఎంక్వైరీకి రెడీ: కత్తి మహేశ్ మృతిపై రియాక్షన్, క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేశ్
సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వస్తున్నాయి. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సందేహాం వ్యక్తం చేశారు. దీంతో దళిత జాతి నుంచి అనుమానాలు, అపోహలు వస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. మహేశ్ మృతిపై అనుమానం ఉంటే.. విచారణ జరిపేందుకు సిద్దం అని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టంచేశారు.
విచారణ జరపటానికి సిద్ధమని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కత్తి మహేశ్ దళిత జాతిలో ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో కూడా మహేశ్ ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. వైద్య చికిత్స కోసం సీఎం జగన్‌మోహన్ రెడ్డి రూ.17 లక్షలు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని కొందరు చేస్తున్న ప్రకటనలపై మంత్రి సురేశ్ స్పందించారు.

కత్తి మహేశ్ మృతిపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. మహేశ్ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి సురేశ్ హామీ ఇచ్చారు. రూ.17 లక్షలు ఇస్తేనే రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చనిపోవడంతో అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications