చంద్రబాబు అమరావతి పర్యటన: కాన్వాయ్ అడ్డగింతతో హై టెన్షన్..దుర్గమ్మే రాజధానికి రక్ష అన్న టీడీపీ చీఫ్

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనకు , జై అమరావతి ఉద్యమానికి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు రాయపూడి లో అమరావతి రైతులు సమరశంఖం పూరిస్తున్నారు. అందులో భాగంగా రాయపూడిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అమరావతి వెళ్తున్న క్రమంలో హై టెన్షన్ నెలకొంది.

కొనసాగుతున్న టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు .. రాజధాని ప్రాంతంలో భారీగా పోలీసులు

కొనసాగుతున్న టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు .. రాజధాని ప్రాంతంలో భారీగా పోలీసులు

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా భారీగా మోహరించిన పోలీసులు అమరావతి లోపలికి వెళ్లే వారికి ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా రాయపూడి వెళ్లే ముందు ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నించారు. అయితే ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన ప్రదేశానికి అనుమతి లేదని పోలీసులు చంద్రబాబును అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.

వెలగపూడి వద్ద చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

వెలగపూడి వద్ద చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

ఈరోజు రాయపూడి సభలో పాల్గొనడానికి వెళుతున్న చంద్రబాబు గుడిలో అమ్మవారి దర్శనం తర్వాత రాయపూడి వెళ్లడానికి ఉండవల్లి మీదుగా, కృష్ణాయ పాలెం మీదుగా రాయపూడి సభకు వెళ్లేందుకు పోలీసులు రోడ్డు మార్గాన్ని క్లియర్ చేశారు. చంద్రబాబునాయుడు రాయపూడి వెళ్లడానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ వెలగపూడి వద్ద చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు పోలీసులు . దీంతో టిడిపి నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ .. కాలి నడకనే వెళ్ళిన చంద్రబాబు

పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ .. కాలి నడకనే వెళ్ళిన చంద్రబాబు

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసుల తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు వెళ్లేందుకు ముందు రూటు మార్చి అవాంతరాలు సృష్టించిన పోలీసులు, ఆ తర్వాత వెలగపూడి వద్ద అడ్డుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమానికి అవాంతరాలు సృష్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఆందోళన తెలియజేయాలని భావించిన టిడిపి నేతలను హౌస్ అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ఏకంగా చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకోవడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు టిడిపి నేతలు. పోలీసులు కాన్వాయ్ ను అడ్డుకోవటంతో చంద్రబాబు కాలినడకనే ఉద్దందరాయునిపాలెంలోని శంకుస్థాపన స్థలానికి వెళ్లి అక్కడ శిరసు వంచి ఆ ప్రాంతానికి నమస్కరించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

ప్రజా రాజధాని అమరావతికి దుర్గమ్మే రక్ష

ప్రజా రాజధాని అమరావతికి దుర్గమ్మే రక్ష

ఈరోజు రాజధాని అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడి లో భారీ బహిరంగ సభకు హాజరు కావడానికి వెళ్లే ముందు చంద్రబాబు బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు.దుర్గమ్మ దర్శనానికి వెళుతుంటే కూడా అవాంతరాలు సృష్టించారని ఆరోపించిన చంద్రబాబు, పసుపు కుంకుమ కూడా తీసుకు రానివ్వకుండా అడ్డుకున్నారు అంటూ మండిపడ్డారు. ఏడాదికాలంగా రాజధాని అమరావతి రైతులు ప్రజా రాజధానిగా అమరావతి నే ఉండాలంటూ పోరాటం చేస్తున్నారని ప్రజా రాజధానికి దుర్గమ్మ రక్షణగా నిలవాలని కోరుకున్నానని చెప్పారు .

న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానన్న చంద్రబాబు

న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానన్న చంద్రబాబు

న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులు మహిళలపై దాడులు చేయడం ఆవేదనకు గురి చేసిందన్నారు. అమరావతి రైతులు ఎన్నో అవమానాలను భరించి రాజధాని కోసం పోరాటం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. దేవతల రాజధాని అమరావతిని విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దుర్గమ్మ రాజధాని అమరావతిని కాపాడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+