భువనేశ్వరి రియాక్షన్: దిగజారిన వారు ఏమైనా మాట్లాడుతారు.. చంద్రబాబుతో సతీమణి
నారా భువనేశ్వరిపై చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు, నందమూరి కుటుంబం ముక్తకంఠంతో ఖండించాయి. అయితే తొలిసారి భువనేశ్వరి స్పందించారు. బాబు ఏడ్వడాన్ని చూసి భువనేశ్వరి కూడా ఇంట్లో భోరున విలపించారని సమాచారం. ఈ క్రమంలో ప్రెస్ మీట్ అవ్వగానే ఇంటికి వెళ్లిన చంద్రబాబు, నారా లోకేశ్‌ను చూసి ఆమె మరింత ఏడ్చారని అంటున్నారు. ఆ తర్వాత వెంటనే కోలుకున్న ఆమె.. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దని తన భర్తకు చెప్పినట్టు సమాచారం.

దిగజారి..
దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడతారని భువనేశ్వరి అన్నట్టు సమాచారం. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయాలని సూచించారట. రాజకీయాల్లో ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్న గారి హయాంలో కొందరు అలాగే మాట్లాడేవారున్నారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటివి మాట్లాడుతారు. మనసుకు బాధనిపిస్తుందని వివరించారు. అలాంటి వాటిని పట్టించుకోవద్దని సూచించారు. పక్కకు పడేసి మన పని మనం చేసుకుపోవాలని భర్తను అనునయించారని తెలుస్తోంది.

వెక్కి వెక్కి ఏడ్చిన భువనేశ్వరి
అసెంబ్లీ పరిణామాల తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. తన భార్యపై అసభ్యంగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సీఎం అయ్యే దాకా అసెంబ్లీలో అడుగు పెట్టనని ప్రతినబూనారు. ఆ ఘటనపై నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖబడ్దార్ అంటూ బాలకృష్ణ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా రోహిత్ సహా అందరూ పెదవి విప్పారు.

సరికాదు..
నారా భువనేశ్వరికి జరిగిన అవమానంపై అన్నీ పార్టీల నేతలు, ప్రతినిధులు స్పందిస్తున్నారు. వైసీపీ నేతల తీరును తప్పుపడుతున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా రియాక్ట్ అయ్యారు. భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లేనని రఘురామకృష్ణరాజు కామెంట్ చేశారు. వైసీపీ నేతల నీచపు మాటలతో నందమూరి కుటుంబం ఎంత తల్లడిల్లిపోయిందో చూశామని అన్నారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటన కేవలం ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినది కాదని... మొత్తం తెలుగుజాతికి జరిగిన అవమానమని చెప్పారు.

అలా అనలేదే..
భువనేశ్వరి కామెంట్స్‌కు సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతుంది. టీడీపీ శ్రేణుల ఆందోళనలు మిన్నంటాయి. దీంతో వైసీపీ స్పందించింది. వారు అలా అనలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అలా కామెంట్ చేస్తే సీఎం జగన్ ఊరుకోరని స్పష్టంచేశారు. దీంతో తమ పార్టీ నేతలను వెనకెసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ మహిళపై కామెంట్స్‌ను మాత్రం తెలుగు సమాజం ఒకవిధంగా జీర్ణించుకోలేకపోతుంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications