జనాన్ని జలగల పీడిస్తోన్న జగన్ సర్కార్.. నాదెండ్ల మనోహర్ నిప్పులు
జగన్ సర్కార్‌పై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అధికార పార్టీపై విపక్షాలు కస్సు బుస్సుమంటున్నాయి. పన్నుల రూపంలో ప్రజలను పీక్కుతింటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఇంటిపన్ను చెల్లించని ఇళ్లకు మునిసిపల్ అధికారులు తాళాలు వేసిన ఘటనపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. సోమావారం అమరావతిలో ఆయన మాట్లాడారు. డబ్బుల కోసం రాష్ట్ర ప్రజలను జగన్ ప్రభుత్వం పీడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీలు ఎలా వేస్తారు..
ఇంట్లో మహిళలు ఉండగా ఇంటికి సీలు వేసి పన్ను కట్టాలని హెచ్చరిస్తారా? అని అడిగారు. అహంకారంతో ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇళ్లకు తాళాలు వేయడం.. కుళాయిలకు బిరడాలు కొట్టడం.. దుకాణాల ముందు చెత్త పోయడం వంటి ఘటనలు పాలకుల వికృత మనస్తత్వానికి అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. ప్రజలను పీడించి.. వేధించి ఖజానా నింపుకోవాలనే అహంకారపూరిత నైజంతో జగన్ రెడ్డి పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

ఓటీఎస్ తర్వాత..
మొన్నటి వరకూ ఓటీఎస్ పేరుతో పేదల నుంచి ముక్కుపిండి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆస్తి పన్ను, కుళాయి పన్ను, చెత్త పన్నుల వసూలు విధానంలో పాలకులు ప్రజల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పడేస్తున్నాం కదా..ప్రజలు మా దగ్గరపడిఉండాల్సిందే అనే నియంతృత్వ ధోరణే వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తోందని చెప్పారు.
Recommended Video


ఇదేనా.. సంక్షేమ పాలన అంటే
జగన్ చెబుతున్న సంక్షేమ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలా ప్రజల గౌరవాన్ని కించపరచలేదని చెప్పారు. ప్రభుత్వం చేసే చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలకు జనసేన అండగా ఉంటుందని ఆయన భరోసాను ఇచ్చారు. సమస్యలపై రాజీలేకుండా పోరాడుతాం అని స్పష్టంచేశారు. వారి సంక్షేమమే తమకు అధిక ప్రాధాన్యం అని నొక్కి వక్కానించారు.












Click it and Unblock the Notifications