అధికారుల కక్కుర్తి: కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్య
అనంతపురం: జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తల్లి పొదుపు డబ్బును అధికారులు కాజేశారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
బాధితుడు నార్పల మండలం గూగూడు వాసి రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణారెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కరోనాతో పసికందు మృతి
కరోనా బారినపడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలికి చెందిన 5 నెలల పసికందు మృతి చెందినట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. సెప్టెంబర్ 28న యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
అయితే, కరోనాకు తోడు న్యూమోనియా కూడా సోకడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆ పసికందు ఆదివారం మృతి చెందాడని ఆయన తెలిపారు. విశాఖలో కరోనాతో పసికందు మృతి చెందడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు 52,516 కేసులు నమోదు కాగా, 473 మంది మరణించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువ స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 7,55,72 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 46,2957 యాక్టివ్ కేసులున్నాయి. 7,03,208 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
6,224 మంది కరోనా బారినపడి మరణించారు.












Click it and Unblock the Notifications