Anantapur: 500 పడకల జర్మన్ హ్యాంగర్ కోవిడ్ ఆసుపత్రి: ప్రారంభించిన వైఎస్ జగన్

అనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 38 వేలకు పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు అవసరమైన చికిత్సను అందించడానికి చాలినన్ని ఆసుపత్రులు అందుబాటులో ఉండట్లేదు. ఐసీయూలు, పడకలు, వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్.. యుద్ధ ప్రాతిపదికన 500 పడకల సామర్థ్యంతో కూడిన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

వెనుకబడిన జిల్లాగా పేరున్న అనంతపురంలో దీన్ని ఏర్పాటు చేసింది. అధునాతన జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించింది. ఒకేసారి 500 మంది కోవిడ్ పేషెంట్లకు అవసరమైన చికిత్సను అందజేయడానికి వీలు ఉంది. జిల్లాలోని తాడిపత్రి సమీపంలో గల ఆర్జా స్టీల్స్ వద్ద దీన్ని నిర్మించింది. 15 రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుంది. దీనికోసం ప్రభుత్వం అయిదున్నర కోట్ల రూపాయలను వ్యయం చేసింది. మొత్తం 13.56 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించింది.

Anantapur: CM YS Jagan virtually inaugurated the 500-bed covid Hospital in Tad

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటువైపు తాడిపత్రిలో నిర్వహించిన ఇదే కార్యక్రమంలో జిల్లా మంత్రి శంకర నారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, పలువురు శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హాజరయ్యారు.

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రత అధికంగా ఉంటోంది. గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఈ జిల్లాలో కొత్తగా 1,041 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిదిమంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,41,798గా నమోదైంది. ఇందులో 1,37,071 మంది డిశ్చార్జ్ అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారు. 937 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,790గా ఉంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+