ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ధ‌ర్మ‌వరం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ధ‌ర్మ‌వ‌రం, ముదిగుబ్బ మండ‌లాల‌ను పూర్తిగా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ ర్గం లో చేర్చారు. ఇక్కడి నుండి మూడు సార్లు గెలిచిన నాగిరెడ్డి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ప‌ని చేసారు. రెండు సార్లు గెలిచి న పివి చౌద‌రి గ‌తంలో పి, జ‌ల‌గం, మ‌ర్రి చెన్నారెడ్డి, అంజ‌య్య మంత్రివ‌ర్గాల‌లో ఉన్నారు. 1999 లొఓ ఇక్క‌డ గెలిచిన కె సూర్య‌ప్ర‌తాప రెడ్డి 2003లో టిడిపి లో చేరి, తాడిప‌త్రిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌రువాత ఆయ‌న కొంత కాలానికి హ‌త్య‌కు గుర‌య్యారు. అనంత‌రం ఆయ‌న కుమారుడు వెంక‌టార‌మిరెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కాంగ్రెస్ నుండి ధ‌ర్మ వ‌రం అభ్య‌ర్దిగా పోటీ చేసి గెలుపొందారు.

14 సార్లు ఎన్నిక‌లు..
ద‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి అయి దు సార్లు,కెఎమ్‌పిపి, స్వ‌తంత్ర పార్టీలు ఒక్కొక్క సారి గెలుపొందాయి. 2009 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ది గా బ‌రి లోకి దిగారు. టిడిపి నుండి జి సూర్య నారాయ‌ణ పోటీ చేసారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ది వెంక‌ట్రామిరెడ్డి గెలిచా రు. ఆ త‌రువాత వైయ‌స్ మ‌ర‌ణం..జ‌గ‌న్ కొత్త పార్టీ నేప‌థ్యంలో ఆయ‌న జ‌న‌గ్ కు మ‌ద్ద‌తుగా వైసిపి లో చేరారు. 2009 లో పోటీ ప‌డిన ఇద్ద‌రు అభ్య‌ర్దులే తిరిగి 2014 లోనూ పోటీలో నిలిచారు.

#AndhraPradeshElections2019: All about Dharmavaram Constituency

2014 లో టిడిపి గెలుపు..
ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల్లో మొత్తంగా 226306 ఓట్లు ఉండ‌గా, అందులో 189375 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన సూర్యనారాయ‌ణ కు 99946 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన వెంక‌ట్రామి రెడ్డికి 85039 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది సూర్య‌నారాయ‌ణ 14911ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన త‌రువాత సైతం ఇక్క‌డ ఇద్ద‌రు నేత‌లు హోరా హోరీగా రాజ‌కీయాలు న‌డుపుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరే అభ్య‌ర్దులు..
ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి వీరిద్దరే పోటీ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. టిడిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్య‌నారాయ‌ణ కు టిడిపి నుండి టిక్కెట్ ఖాయంగా క‌నిపిస్తోంది. అదే విధంగా వైసిపి నుండి వెంక‌ట్రామి రెడ్డి తిరిగి పోటీ చేయ‌టం ఖాయం. ఇప్ప‌టికే వెంక‌ట్రామి రెడ్డి ఓట్ల వ్య‌వ‌హారం పై కోర్టులో పోరాటం చేస్తు న్నారు. ఇక‌, 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం అభ్య‌ర్దిగా పోటీ చేసిన స‌దాశివ రెడ్డి 20691 ఓట్లు ద‌క్కించుకున్నారు. ఈ సారి జ‌న‌సేన ఎవ‌రిని బ‌రిలోకి దింపేది తెలియాల్సి ఉంది. ఇక్క‌డ ప్ర‌ధాన పోటీ మాత్రం టిడిపి - వైసిపి మ‌ధ్య‌నే ఉండ‌నుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+