లేపాక్షిలో వేలాడే రాతి స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయిన జీ20 ప్రతినిధులు
దేశంలో జీ20 సమావేశాల కోలాహలం నెలకొంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే ఈ సమ్మిట్ నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటవుతున్నాయి. జీ20 సన్నాహక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులు లేపాక్షి ఆలయాన్ని సం
పుట్టపర్తి: ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సన్నాహాక సమావేశాలు ఇప్పటికే మొదలయ్యాయి. బెంగళూరు, ముంబై, జైపూర్‌లల్లో తొలిదశ సమావేశాలు ముగిశాయి కూడా. త్వరలో ఏపీ ఈ భేటీకి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ హాజరు కానున్నారు. వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

జీ20లో భారత్‌తోపాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్ అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంటుంది.
సన్నాహక సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయా దేశాల ప్రతినిధులు ఇవ్వాళ శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని చారిత్రాత్మక కట్టడం, ప్రాచీన లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. ఏకరాతితో నిర్మించిన మహాశివుడి విగ్రహం వద్ద ఫొటో దిగారు. ఆలయ అధికారులు లేపాక్షి విశిష్ఠత గురించి వారికి వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే రాతి స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

ఆలయ ప్రాశస్త్యం, శిల్పకళ సంపద, దేవాలయ నిర్మాణం తదితర వివరాలను భారత పురావస్తు విభాగం అధికారులు జీ20 ప్రతినిధులకు వివరించారు. ఈ ఆలయం ఏఎస్ఐ ఆధీనంలో ఉంది. లేపాక్షి నందిని సందర్శించారు. ఆలయంలో అతి ప్రాచీన శిల్పకళ సంపదకు ముగ్ధులయ్యారు. ఆలయ నిర్మాణ ఓ అద్భుతమని కీర్తించారు.












Click it and Unblock the Notifications