జగన్ 10కోట్లు డిమాండ్ చేసారు : కులంతో గెలవటానికి ప్రయత్నం : జేసి విమర్శలు..
వైయస్ జగన్ పై విమర్శలు చేసే టిడిపి ఎంపి జేసి దివాకరరెడ్డి మరసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ కేసుల గురించి..ఆయన వ్యవహార శైలి పై విమర్శించే జేసి ఇప్పుడు ఆయన టిక్కెట్ల కోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ కొత్త ఆరోపణ చేసారు. అదే సమయంలో కులంతో గెలవటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అనంతపురం ఎంపి జేసి దివాకర రెడ్డి వైసిపి అధినేత జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. అనంతపురం దర్మ పోరాట దీక్ష వేదికగా జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న నవీన్ నిశ్చల్‌ను జగన్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక నిశ్చల్ తలపట్టుకున్నాడని తెలిపారు. టిక్కెట్ కోసమే రూ.10 కోట్లు అడిగితే... రాష్ట్రాభివృద్ధికి ఎంత తీసుకుంటారో అంటూ ఎద్దేవా చేశారు.

మరోవైపు కులం పేరుతో గెలవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కులం బువ్వ పెడుతుందా అని ప్రశ్నించారు. ఇంత వరకు రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబుల కులమేంటని అడిగినోడు లేడన్నారు. సొంత జిల్లాలో జరుగుతున్న దీక్ష కావటం తో దివాకర రెడ్డి వైసిపి అధినేతను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు.
గతంలోనూ జేసి బ్రదర్స్ పలు సందర్బాల్లో జగన్ ను టార్గెట్ చేసారు. దివకార్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం సమయం లో జగన్ చేసిన ఆరోపణలకు ప్రతిగా..జేసి ప్రభాకరరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇక, ఎంపీగా ఉన్న దివాకర రెడ్డి ప్రతీ సందర్బంలోనూ జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే ఘని టిడిపి వీడి వైసిపి లో చేరారు. దీంతో..ఆక్కడ నవీన్ నిశ్చల్ కు టిక్కెట్ కేటాయింపు పై అనుమానం మొదలైంది. ఇప్పుడు జేసి చేసిన ఆరోప ణలతో అనంత వైసిపి లో కలకం మొదలైంది..












Click it and Unblock the Notifications