‘పోలీసులతో బూట్లు నాకిస్తా’ వ్యాఖ్యల ఎఫెక్ట్: అనంతపురం రూరల్ పీఎస్‌కు జేసీ దివాకర్ రెడ్డి

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. గత నెల 18వ తేదీన పోలీసులపై జేసీ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదవడంతో.. ఇప్పటికే కోర్టు నుంచి బెయిల్ కూడా తీసుకున్నారు. ప్రొసిజర్ ప్రకారం శనివారం పోలీసుస్టేషన్‌కు వచ్చి, పత్రాలను అందజేశారు.

చంద్రబాబు సమక్షంలోనే..

చంద్రబాబు సమక్షంలోనే..

గతనెల 18వ తేదీన అనంతంపురంలో టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తా అని అన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో జేసీ దివాకర్ రెడ్డి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.

కోర్టు ఆదేశాలతో

కోర్టు ఆదేశాలతో

కోర్టు ఆదేశాలతో అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్‌కు వచ్చి, కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో బెయిల్‌కు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతోంది. కేసుకు సంబంధించి నెలకు రెండుసార్లు పీఎస్‌కు వెళ్లాలని కోర్టు.. జేసీ దివాకర్ రెడ్డిని ఆదేశించింది. ఆ మేరకు ఇవాళ పీఎస్‌కు వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి.

పోలీసులపై నోటిదురుసు

పోలీసులపై నోటిదురుసు


గత నెల 18వ తేదీన అనంతపురంలో టీడీపీ నేతల సమావేశంలో అధినేత చంద్రబాబు నాయుడు సాక్షిగా జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కించపరుస్తూ మాట్లాడారు. ఎస్పీ, ఆ స్థాయి పైన అధికారులు గానీ, కింది స్థాయి అధికారులు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం ఎస్పీని ఉదహరిస్తూ.. మిగతా పోలీసుల వైఖరిపై కూడా జేసీ ఫైరయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారి సంగతి చెబుతామని సభా వేదికనుంచి హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని పేర్కొన్నారు.

బూట్లు నాకిస్తా..

బూట్లు నాకిస్తా..


మరో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని చెప్పారు. పోలీసులు ఐదేళ్లు మాత్రమే పదవీలో ఉండరని గుర్తుచేశారు. మినిమం పదేళ్ల సర్వీసు ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి వారు ఎక్కడ ఉన్నా వదిలే ప్రస్తకే లేదని హెచ్చరించారు.

పోలీసులపైనే కేసులు

పోలీసులపైనే కేసులు


పోలీసులపైనే కేసులు పెడతామని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను వేధించిన వారిపై గంజాయి, సారా కేసులు పెడతామని హెచ్చరించారు. జగన్ గురించి చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని గుర్తుచేశారు. కానీ ఆయన వినిపించుకోలేదని జేసీ చెప్పారు. శాంతి శాంతి అంటూ చంద్రబాబు తమను ముంచాడని అధినేతను కూడా జేసీ వదల్లేదు. చంద్రబాబులో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఇవాళ పీఎస్‌కు వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+