పోలీసులతో బూట్లు నాకిస్తా, త్వరలోనే ఎన్నికలు..అంతా చంద్రబాబు వల్లే: జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కించపరుస్తూ మాట్లాడారు. జేసీ అలా కామెంట్లు చేస్తుంటే.. చంద్రబాబు కూడా తల ఊపుతూ అతనికి వంతపాడినట్టు వ్యవహారించారు. బుధవారం అనంతపురంలో జరిగిన టీడీపీ సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారంలోకి వస్తే..
ఎస్పీ, ఆ స్థాయి పైన అధికారులు గానీ, కింది స్థాయి అధికారులు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం ఎస్పీని ఉదహరిస్తూ.. మిగతా పోలీసుల వైఖరిపై కూడా జేసీ ఫైరయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారి సంగతి చెబుతామని సభా వేదికనుంచి హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని పేర్కొన్నారు.

రెండున్నరేళ్లలో ఎన్నికలట..
మరో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని చెప్పారు. పోలీసులు ఐదేళ్లు మాత్రమే పదవీలో ఉండరని గుర్తుచేశారు. మినిమం పదేళ్ల సర్వీసు ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి వారు ఎక్కడ ఉన్నా వదిలే ప్రస్తకే లేదని హెచ్చరించారు.

పోలీసులపైనే కేసులట..
పోలీసులపైనే కేసులు పెడతామని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను వేధించిన వారిపై గంజాయి, సారా కేసులు పెడతామని హెచ్చరించారు. జగన్ గురించి చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని గుర్తుచేశారు. కానీ ఆయన వినిపించుకోలేదని జేసీ చెప్పారు. శాంతి శాంతి అంటూ చంద్రబాబు తమను ముంచాడని అధినేతను కూడా జేసీ వదల్లేదు. చంద్రబాబులో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రిటైర్ అయినా.. వదల బొమ్మాళీ..
151 స్థానాలతో పటిష్టంగా వైసీపీ ఉండగా.. రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తాయని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమను వేధించిన అధికారులను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ సదరు అధికారులు పదవీ విరమణ చేసినా.. వదిలిపెట్టబోమని కామెంట్ చేశారు. తమ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తా అంటూ జేసీ హాట్ కామెంట్స్ చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications