వారిని మార్చకుంటే బాబుకు కష్టమే : మోదీ ఇలా అయితే ప్రధాని అవుతారు: జేసి సంచలనం..!
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసారు.
ఏపిలో తాము అధికారంలోకి రావటం ఖాయమని టిడిపి నేతలు చెబుతుంటూ జేసికొత్త భాష్యం చెప్పుకొచ్చారు. అదే వి ధంగా కేంద్రంలో మోదీ ప్రధాని కాకూడదని చంద్రబాబు కోరుకుంటున్న వేళ..జేసి భిన్నంగా స్పందించారు.
40 శాతం మార్చాలి..
ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ టిడిపి ఎమ్మెల్యేల్లో 40 శాతం మందిని మార్చకపోతే సీయం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తిరి గి గెలవటం కష్టమని జేసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే టిడిపి అధినేత దాదాపు పది లోక్‌సభ నియోజకవ ర్గాల పరిధిలో అసెంబ్లీ సీట్లు ఖరారు చేసారు. ఎక్కువ శాతం సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జేసి చేసిన కామెంట్లు టిడిపిలో కలకలం సృష్టిస్తున్నాయి. గతంలోనూ జేసి ఇదే రకమైన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా అనంతపురం లోక్‌సభ పరిధిలో ఆయన పలువురు అభ్యర్ధులను మార్చాలని సూచిస్తున్నారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే జేసి ఇటువంటి వ్యాఖ్యలను చేసారా అనే చర్చ జరుగుతోంది. టిడిపి లో ఎమ్మెల్యేల పని తీరు బాగో లేదని జేసి దివాకర రెడ్డి తేల్చి చెప్పారు.

ఇలాగే ఉంటే మరోసారి ప్రధానిగా మోదీ..
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావటం పై వ్యాఖ్యలు చేసిన జేసి దివాకర రెడ్డి కేంద్రంలో అధికారం దక్కటం పైనా స్పందించారు. బిజెపి తిరిగి అధికారంలోకి రాకూడదని..మోదీ తిరిగి ప్రధాని అవ్వకుండా చూడటమే లక్ష్యంగా చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో జేసి చేసిన వ్యాఖ్యలు చర్చనీ యాంశంగా మారాయి. దేశ సరిహద్దుల్లో పరిస్థితులు ఇలానే ఉంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం సరిహద్దుల్లో జరిగిన పరిస్థితుల పై రాజకీయంగా ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఇదే పరిస్థితు ల్లో బిజెపి నేతలు సైతం గట్టిగానే స్పందిస్తున్నారు. టిడిపి అధినేత లక్ష్యానికి వ్యతిరేకంగా జేసి చేస్తున్న వ్యాఖ్యల పై టిడిపి అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications