• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

"కియా" క్యా కియా : క‌్రెడిట్ ప్ర‌ధానిదా..ముఖ్య‌మంత్రిదా : సోష‌ల్ మీడియ‌లో వార్‌..!

|

ఏపిలోని అనంత‌పురం లో కియా సంస్థ తొలి కారు ఉత్ప‌త్తి చేసింది. ముఖ్య‌మంత్రి తొలి కారును ప్రారంభించ‌టం తో పాటుగా దీనికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించారు. రాయ‌ల‌సీమ లో కియా సంస్థ‌ను తెచ్చిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని చెప్పారు. ఈ స‌మ‌యంలోనే బిజెపి నేత‌లు స్పందించారు. ప్ర‌ధాని వ‌ల‌నే కియా ఏపికి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. వైసిపి నేత‌లు మాత్రం ఇంకా అక్క‌డ ఉత్ప‌త్తి మొద‌లు కాలేద‌ని..ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఒక కారును ప్రారంభించార‌ని చెబు తున్నారు. అయితే, దీనిని టిడిపి నేత‌లు ఖండిస్తున్నారు.

ప్ర‌ధాని మోదీకే ఆ క్రెడిట్..

ప్ర‌ధాని మోదీకే ఆ క్రెడిట్..

ప్ర‌ధాని మోదీ ప్రోత్సాహం తోనే ఏపికి కియా కార్ల ప‌రిశ్ర‌మ వ‌చ్చింద‌ని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వెల్ల‌డించారు. ప్ర‌ధాని ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో కియా యాజ‌మాన్యంతో చ‌ర్చించి మేకిన్ ఇండియా లో భాగంగా ఆ సంస్థ‌ను ఏపికి తీసుకొచ్చార‌ని వివ‌రించారు. ప్యాకేజి లో భాగంగా కియో ప‌రిశ్ర‌మ ఏపికి వ‌చ్చింద‌ని లోకేష్ చెప్పిన విష‌యాన్ని క‌న్నా గుర్తు చేస్తున్నారు. కేంద్ర స‌హ‌కారం, చొర‌వ‌, ప్ర‌మేయంతో వ‌చ్చిన ప్రాజెక్టుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ఖాతాల్లో చూపిస్తోంద‌ని క‌న్న ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఈ ర‌కంగా పోస్ట్ చేసారు. మీరు క్యా "కియా"..?? ,ఏపీకి కియా ప్లాంట్ రావడానికి కారణం మోదీ గారు..కాదని మీరు పబ్లిక్ గా చెప్పగలరా.!?

మీరు .. కియా పేరుతో కేంద్రం కృషిని హైజాక్ "కియాష‌..! కియా పేరుతో అవినీతి "కియా"..!కియా పేరుతో పబ్లిసిటీ "కియాష‌..! కియా పేరుతో భూ-మాఫియా కు సపోర్ట్ "కియా..! అంటూ ట్వీట్ చేసారు.

కార్ల ఉత్ప‌త్తికి మ‌రో ఏడాది..అదంతా షో

ఇదే స‌మ‌యంలో వైసిపి ఎంపి విజ‌యసాయిరెడ్డి సైతం స్పందించారు. కియా కార్ల పరిశ్రమను అనంతపురంలో పెట్టేం దుకు హ్యుందాయ్‌ కంపెనీని ఒప్పించింది ప్రధాన మంత్రి అని పేర్కొన్నారు. కియా మోటార్స్‌ను తమిళనాడులో నెల కొల్పేందుకు ఆ సంస్థ సిద్ధమైన తరుణంలో.. అది ఏపీని ఎంపిక చేసుకునేలా ఆయన ఒత్తిడి తెచ్చారని చెప్పారు. కియా మోటార్స్‌ను ఏపీకి తానే తీసుకొచ్చానని సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రజలు అదంతా మర్చిపోయారనుకుని.. చంద్రబాబు కష్టపడి కియాను ఏపీకి తెచ్చినట్టు కటిం గులిస్తున్నారని విమర్శించారు. కియా కార్ల ఉత్పత్తికి ఇంకా ఏడాది పడుతుందని ఆ కంపెనీ వెబ్‌సైట్లో పేర్కొన్న విష యాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అనంతపురం కియా మోటార్స్‌లో మొదటి కారు తయా రైందని చంద్రబాబు షో చేశారని విమర్శించారు. చెన్నై ప్లాంటు నుంచి తెచ్చిన ఇంజన్‌, విడిభాగాలతో అసెంబ్‌లు చేసిన కారును విడుదల చేశారని ఆరోపించారు.

అవ‌న్నీ క‌ట్టుక‌ధ‌లంటున్న టిడిపి..

కియా ప‌రిశ్ర‌మ ఏపికి రావ‌టం..అత్యంత వేగంగా తొలి కారు ఉత్ప‌త్తి అవ‌టాన్ని బిజెపి నేత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాద్య‌క్షుడు కుటుంబరావు విమర్శించారు. ప్ర‌ధాని మోదీ వ‌ల్లే ఏపికి కియో పరిశ్ర‌మ వ‌చ్చిన ట్లుగా అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని..రాష్ట్ర ప్ర‌భుత్వ విజ‌యాన్ని తమ ఖాతాలో వేసేకునేందుకు సామాజిక మా ధ్య‌మాల్లో క‌ట్టుక‌ధ‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. కియో సంస్థ ప్ర‌తినిధుల‌ను లంచం అడిగిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని..బిజెపి నేత‌లు క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. అయితే, ఇప్పుడు కియో ప‌రిశ్ర‌మ రాయ‌ల‌సీమ‌లో త‌మ కు రాజ‌కీయంగా స్థానిక ప్ర‌జ‌ల్లో మైలేజ్ పెంచుతుంద‌ని టిడిపి నేత‌లు భావిస్తుండ‌గా ఇప్పుడు మొద‌లైన ఈ వివాదం కొత్త మ‌లుపు తిరుగుతోంది.

English summary
KIO credit game between TDP and BJP. BJP leaders says With Modi interest only KIA industry started in AP. YCP says production not yet started in KIA..for election stunt only CM started car which bring form Korea. But, TDP countered BJP leaders statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X