పగలు జనాలు.. రాత్రి ఫుల్ బాటిల్ కొడతాడు, బాలకృష్ణపై గోరంట్ల విసుర్లు
అభిమానులపై విరుచుకుపడుతున్నారు బాలయ్య. తనను చూసి.. మాట్లాడేందుకు వచ్చినవారిపై ప్రతాపం చూపిస్తున్నారు. ఇదివరకు చాలా సందర్భాల్లో చేయి చేసుకున్నారు. ఇటీవల మరోసారి తన ప్రతాపం చూపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. బాలయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బాలకృష్ణతోపాటు చంద్రబాబు, నారా లోకేశ్‌పై గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ముసలివాడు అయిపోయారని ఫైరయ్యారు. లోకేశ్‌కి నోట మాట రాదని విమర్శించారు. పంక్చరైన సైకిల్‌ను చంద్రబాబు వయోభారంతో తొక్కలేక తొక్కుతున్నారని అన్నారు.

బాలకృష్ణ రాత్రి ఫుల్ బాటిల్ కొడతారని, పగలు జనాలను కొడతారని మాధవ్ ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాక... హిందూపురం జనాలు బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. బాలయ్య పక్కన నిల్చోవడానికి కూడా వణికిపోతున్నారని అన్నారు. బాలయ్య చేత దెబ్బలు తిన్నవాళ్లు, బూతులు తిట్టించుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారని చెప్పారు.
బాలకృష్ణకు ఓటేసిన పాపానికి శిక్షను అనుభవించడానికి అభిమానులు సిద్ధంగా లేరని మాధవ్ తెలిపారు. అందుకే వారంతా వైసీపీ వైపు చూస్తున్నారని అన్నారు. వారికి జగన్ సాదర స్వాగతం పలుకున్నారని తెలియజేశారు.












Click it and Unblock the Notifications