వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

YSRCP Manifesto 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు గుడ్‌బై చెప్పారు. రాజీనామాలు చేశారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. పితాని బాలకృష్ణ, పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజాబాబు, డీఎంఆర్ శేఖర్, యనమల కృష్ణుడు..వంటి సీనియర్లు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు.

State TDP secretary Kuruba Siva Bala joined the YSRCP

తాజాగా తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ నాయకురాలు, రాష్ట్ర కురుబ శివబాల ఆ పార్టీకీ రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్‌బై చెప్పారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

శివబాల సొంత జిల్లా అనంతపురం. భర్త నాగరాజుతో కలిసి ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్, కురుబ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం వల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తానంటూ గతంలో ఆమెకు హామీ ఇచ్చారు పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ హామీని ఆయన నెరవేర్చలేదు.

దీనితో ఇప్పటికే శివబాల.. టీడీపీకి రాజీనామా చేశారు. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్లను కాదని, డబ్బు మూటలు ఇచ్చిన వారికి చంద్రబాబు టికెట్లు కేటాయించారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ టికెట్లను అమ్ముకున్నారంటూ అప్పట్లో ఆరోపించారు.

తాజాగా- ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ సమక్షంలో శివబాల.. వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. బుల్లె లింగ ప్రసాద్ కురుబ సహా పలువురు అనుచరులు, టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+