ఆ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖాయం చేసిన నారా లోకేష్: తల్లీకొడుకులకు టికెట్లు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 59వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొంటోన్నారు.
ఈ పాదయాత్ర సందర్భంగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన పలువురు చేనేత కార్మికులు, బోయ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు జిల్లేడు బండ ప్రాజెక్టు భూ నిర్వాసితులు నారా లోకేష్‌ను కలిశారు. నారా లోకేష్ ఫొటోతో నేసిన పట్టువస్త్రాలను ఆయనకు అందించారు. ఎన్నో సంవత్సరాలుగా తమకు ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించట్లేదనే విషయాన్ని జిల్లేడు బండ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

పాదయాత్రలో భాగంగా బత్తలపల్లి, లింగారెడ్డి పల్లిల్లో నిర్వహించిన బహిరంగ సభ, రోడ్ షోలకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు, ధర్మవరం నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరికి టికెట్లను ఖరారు చేశారు నారా లోకేష్. రాప్తాడుకు పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్‌ను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారిద్దరు ఆయా స్థానాల నుంచి పోటీ చేస్తారని, ఆశీర్వదించాలని కోరారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేయలేదు. బదులుగా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల బరిలో దించింది తెలుగుదేశం పార్టీ. రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరామ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు. 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తోపుదుర్తి విజయం సాధించారు. దీనితో ఆయన తన నియోజకవర్గాన్ని ధర్మవరానికి బదలాయించుకున్నారు.
శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా ఆవిర్భవించిన తరువాత రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న మండలాలు ధర్మవరంలో కలిసిపోవడమే దీనికి కారణం. ఇప్పుడు అదే ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ పేరును నారా లోకేష్ ఖరారు చేశారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి మరోసారి పరిటాల సునీత ఎన్నికల రేసులో నిల్చోనున్నారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారామె.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications