అనంతపురంలో బయోటెక్ పార్క్ హబ్: ఇండస్ జీన్స్ వ్యాక్సిన్ల తయారీ యూనిట్
అనంతపురం: అనంతపురం జిల్లాలో బయోటెక్ పార్క్‌ను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని సుమారు 550 ఎకరాల్లో దీన్ని నెలకొల్పడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించింది. ఇప్పటికే ఇండస్‌జీన్స్ ఎక్స్‌ప్రెషన్స్ అనే వ్యాక్సిన్ల తయారీ కంపెనీ ఈ బయోటెక్ పార్క్‌లో తన కార్యకలాపాలను ఆరంభించింది. వ్యాక్సిన్ల తయారీ కంపెనీని నిర్మిస్తోంది. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు కొనసాగుతోన్నాయి.
దీన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. 720 కోట్ల రూపాయలను వ్యయం చేస్తోన్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల కనీసం వెయ్యిమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ యూనిట్ నిర్మాణం పూర్తయితే.. రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఇదే అవుతుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని బయోటెక్ పార్క్ కోసం ఎంపిక చేసింది ప్రభుత్వం. దీనితో పాటు- పుట్టపర్తి విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

ఈ విమానాశ్రయాన్ని కమర్షియల్ అవసరాల కోసం అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనివల్ల బెంగళూరు మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో ఈ ఎయిర్‌పోర్ట్ కీలకంగా మారుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. పుట్టపర్తి విమానాశ్రయం, హైదరాబాద్-బెంగళూరు రైల్వే మార్గం సమీపంలో ఉండటం వల్ల ప్రతిపాదిత బయోటెక్ పార్క్ హబ్‌కు భవిష్యత్‌లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తోంది.












Click it and Unblock the Notifications