ఏపీలో 1461 కరోనావైరస్ కేసులు: 18వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కొత్త కేసులివే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 2వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 63,849 నమూనాలను పరీక్షించగా.. 1461 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1461 కరోనా కేసులు, 15 మంది మృతి
తాజాగా నమోదైన 1461 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్రు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,564 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 18వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,113 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,52,736కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 18,882 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,53,11,733 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 235 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలు జిల్లాలో 12 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 28, చిత్తూరులో 195, తూర్పుగోదావరిలో 98, గుంటూరులో 182, కడపలో 59, కృష్ణాలో 210, కర్నూలులో 12, నెల్లూరులో 195, ప్రకాశంలో 112, శ్రీకాకుళంలో 41, విశాఖపట్నంలో 74, విజయనగరంలో 20, పశ్చిమగోదావరిలో 235 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,80,999, చిత్తూరులో 2,34,023 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,686) కరోనా కేసులున్నాయి. ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 28,204 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత దేశంలో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,19,98,158 కి చేరుకుంది. రోజువారీ మరణాల సంఖ్య 373 గా నమోదయింది. తాజా మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 428,682 కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,88,508గా ఉంది. సోమవారం ఒక రోజే 13,680 యాక్టివ్ కేసులు తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కరోనా కారణంగా కోలుకున్నవారు 41,511 మంది. దీంతో ఇప్పటి వరకు మొత్తం రికవరీల సంఖ్య 3,11,80,968 కి చేరుకుంది. అధికారులు దేశవ్యాప్త పరీక్షలు వేగవంతం చేస్తున్నందున, సోమవారం నాటికి మొత్తం 48,32,78,545 నమూనాలను పరీక్షించారు . ఇందులో 15,11,313 నమూనాలను ఒక రోజులో పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.












Click it and Unblock the Notifications