ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, టెస్టులు కూడా: 20వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా కొత్త కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 2వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 59,641 నమూనాలను పరీక్షించగా.. 1546 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1546 కరోనా కేసులు, 15 మంది మృతి
తాజాగా నమోదైన 1546 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,70,008కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,410 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 20వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,968 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,36,016కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 20,582 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,47,08,540 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 416 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరం జిల్లాలో ఏడుగురు కరోనా బారినపడ్డారు.
Recommended Video

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 18, చిత్తూరులో 229, తూర్పుగోదావరిలో 416, గుంటూరులో 90, కడపలో 115, కృష్ణాలో 158, కర్నూలులో 43, నెల్లూరులో 151, ప్రకాశంలో 201, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 54, విజయనగరంలో 07, పశ్చిమగోదావరిలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,78,204, చిత్తూరులో 2,31,604 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. కాగా, ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,483) కరోనా కేసులున్నాయి.












Click it and Unblock the Notifications