ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు: జిల్లాలవారీగా కొత్త కేసులివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 2వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 73,341 నమూనాలను పరీక్షించగా.. 1746 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1746 కరోనా కేసులు, 20 మంది మృతి

ఏపీలో కొత్తగా 1746 కరోనా కేసులు, 20 మంది మృతి

తాజాగా నమోదైన 1746 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,90,656కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 20 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,615 మృతి చెందారు.

ఏపీలో 18,688 యాక్టివ్ కేసులు

ఏపీలో 18,688 యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1648 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,58,275కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 18,766 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,55,26,861 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 304 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 20 మంది చొప్పున కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 27, చిత్తూరులో 203, తూర్పుగోదావరిలో 304, గుంటూరులో 160, కడపలో 78, కృష్ణాలో 125, కర్నూలులో 20, నెల్లూరులో 236, ప్రకాశంలో 106, శ్రీకాకుళంలో 91, విశాఖపట్నంలో 115, విజయనగరంలో 20, పశ్చిమగోదావరిలో 261 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,82,090, చిత్తూరులో 2,34,634 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,751) కరోనా కేసులున్నాయి. మరోవైపు ఆగస్టు 16 నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిబంధనలను పాటిస్తూనే తరగతులు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులకు 90 శాతం వరకు వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది.

Recommended Video

    AP Corona Virus Update.. ఆ రెండు జిల్లాల్లోనే అధికం!!
    దేశ వ్యాప్తంగా కొత్తగా ఎన్ని కేసులంటే..?

    దేశ వ్యాప్తంగా కొత్తగా ఎన్ని కేసులంటే..?


    ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,70,495 నమూనాలను పరీక్షించగా 40,120 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2.6 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.21 కోట్లు దాటింది. ఇక మరణాలు మరోసారి 500 దాటాయి. శుక్రవారం కరోనా మహమ్మారి బారినపడి 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,30,254కు చేరింది. శుక్రవారం 42వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనావైరస్ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.13 కోట్లకు చేరింది. రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 1.20 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,84,227 మంది కరోనాతో బాధపడుతున్నారు. కాగా, గత 24 గంటల వ్యవధిలో 57,31,574 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన కరోనా టీకా డోసుల సంఖ్య 52.95 కోట్లకు చేరింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 49 కరోనా కేసులు నమోదు కాగా, వరుసగా రెండో రోజు కూడా కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.07 శాతంగా ఉంది. సెకండ్ వేవ్ ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీలో మరణాలు సంభవించని రోజు ఇది 8వది కావడం గమనార్హం. కాగా, మహారాష్ట్రలోని ముంబైలో డెల్టా వేరియంట్ ప్లస్ బారినపడి ఓ వృద్ధుడు మరణించాడు. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ముంబైలో సంభవించిన తొలి మరణం ఇదే. మొత్తం మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కారణంగా సంభవించిన రెండో మరణం ఇది. డెల్టా ప్లస్ వేరియంట్ కూడా వ్యాధిని వేగంగా వ్యాప్తి చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. గురువారం కొత్తగా కేరళలో 21,445 కరోనా కేసులు నమోదయ్యాయి. 160 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు కేరళలో మొత్తం మరణాల సంఖ్య 18,120కి పెరిగింది. పాజిటివిటీ రేటు 14.73 శాతానికి చేరింది. జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల గణాంకాలు ఇలా ఉన్నాయి. మలప్పురం -3300, కోజికోడ్- 2534, త్రిస్సూర్ -2465, ఎర్నాకుళం -2425, పాలక్కాడ్ -2168, కొల్లాం -1333, కన్నూర్- 1338, అలప్పుజ -1238, కొట్టాయం -1188, తిరువనంతపురం- 933, వయనాడ్ -720, పతనమిట్ట -630, ఇడుక్కి -589, కాసరగోడ్ -578 కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో మొత్తం 1,45,582 నమూనాలను పరీక్షించారు. కర్ణాటక, మహారాష్ట్రలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటకలో వినాయక చవితి నుంచి విజయదశమి వరకు అన్ని పండగలను రద్దు చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+