ఏపీలో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు... మరో 97మంది మృతి....
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,91,326కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో మరో 97 మంది మృతి చెందారు. ఇందులో చిత్తూరు జిల్లాలో 13 మంది,అనంతపురం 11,నెల్లూరు 10,తూర్పుగోదావరి 8,కడప 8,కర్నూలు 8,గుంటూరు 6,విశాఖపట్నం 6,శ్రీకాకుళంలో 5,కృష్ణా జిల్లాలో 4,విజయనగరంలో 3 చొప్పున మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3189కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 61,469 కరోనా టెస్టులు చేయగా... మొత్తం టెస్టుల సంఖ్య 31,91,326కి చేరింది. గడిచిన 24గంటల్లో మరో 8593 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 252638 మంది డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 88,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో 1220 కేసులతో చిత్తూరు,1020 కేసులతో అనంతపురం ఉన్నాయి.

Recommended Video
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కరోనాపై సమగ్ర సమాచారం కోసం హెల్ప్‌లైన్ 82971 04104 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. కరోనా సోకితే కనిపించే లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పరీక్షల వివరాలను హెల్ప్ లైన్ ద్వారా వివరించనున్నారు. కరోనా సోకితే ఎవరిని సంప్రదించాలి... ఏం చేయాలన్న సందిగ్ధం ప్రజలను వెంటాడుతున్న నేపథ్యంలో ఈ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications