ఏపీలో కొత్తగా 10వేలకుపైగా కరోనా కేసులు: భారీగా రికవరీ, తగ్గుతున్న యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 10వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేగాక, కరోనా మహమ్మారితో మరణించినవారి సంఖ్య కూడా వందకు దిగువనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 85,311 నమూనాలను పరీక్షించగా.. 10,413 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 10,413 కరోనా కేసులు, 83 మరణాలు

ఏపీలో కొత్తగా 10,413 కరోనా కేసులు, 83 మరణాలు

తాజాగా నమోదైన 10,413 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,38,990కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 83 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరిలో 11 మంది, అనంతపురంలో 8 మంది, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖట్పంలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒక్కరు చొప్పున మరణించారు.
దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 11,296కు చేరింది.

ఏపీలో రికవరీలు పెరగడంతో తగ్గుతున్న యాక్టివ్ కేసులు

ఏపీలో రికవరీలు పెరగడంతో తగ్గుతున్న యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 15,469 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 15,93,921కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1,33,773 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2075 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 293 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 865, చిత్తూరులో 1574, తూర్పుగోదావరిలో 2075, గుంటూరులో 686, కడపలో 610, కృష్ణాలో 692, కర్నూలులో 425, నెల్లూరులో 527, ప్రకాశంలో 631, శ్రీకాకుళంలో 427, విశాఖపట్నంలో 634, విజయనగరంలో 293, పశ్చిమగోదావరిలో 974 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+