తొలిరోజే విషాదం: ప్రమాదం ఎలా? కామినేనికి నిలదీత, బాధితుల గోడు
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో తొలిరోజే రాజమండ్రిలో అపశృతి చోటు చేసుకుంది. గోడ ఎక్కే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి 27 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కువ మంది ఒకే ఘాట్‌కు వచ్చారు.
మృతుల్లో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లాకు యండగండికి చెందిన రుద్రరాజు లక్ష్మి(65)గా గుర్తించారు. మిగిలినవారి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్ వద్దకు ఒకేసారి భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. పుష్కర ఘాట్ మొదటి ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది.

మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే కావడం గమనార్హం. భక్తులు గోడ ఎక్కే సమయంలో తొక్కిసలాట జరగడంతో మహిళలు, వృద్ధులు కిందపడ్డారు. లోపలకు వచ్చే వారితో, బయటకు వెళ్లే వారితో రద్దీగా మారింది.
వెంటనే అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి. గోదావరి పుష్కర ఘాట్‌వైపు వచ్చే భక్తులను వారిని వీఐపీ ఘాట్, కోటిలింగాల వైపు మళ్లిస్తున్నారు. భక్తులు ఒకే ఘాట్‌కు వెళ్లవద్దని, అలా చర్యలు తీసుకుంటామని అధికారులు, ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజమండ్రికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు.
కంట్రోల్ రూం నుండి సీఎం చంద్రబాబు సమీక్ష
రాజమండ్రిలోని పుష్కర ఘాట్ మొదటి ప్రవేశద్వారం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని సమీక్షించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్‌కు సామర్థ్యానికి మించి భక్తులు రావటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఇది దురదృష్టకరమన్నారు. ఇతర ఘాట్‌లను కూడా భక్తులు వినియోగించుకోవాలన్నారు.
తొక్కిసలాటకు ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలను వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు పరామర్శించేందుకు వచ్చారు. ఆయన పరామర్శించారని భావించినప్పటికీ.. బాధితులు అడ్డుకోవడంతో అతను వెనుదిరిగారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications