శ్రీకాకుళంలో విషాదం: కుక్క‌ల దాడిలో ప‌దేళ్ల బాలిక స్పంద‌న మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వీధి కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతోన్న ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి. అధికారులు మాత్రం వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోలేకపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పొందూరు మండలం దళ్లిపేట‌లో కుక్క‌లు స్వైర విహారం చేశాయి.

10 Years Girl Dies From Dog Attack In Srikakulam District

గురువారం ఉదయం పొలం వద్ద ఉన్న తన తాతయ్యకు స్పందన(10) టీ తీసుకెళ్తుండగా కుక్కలు దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతి పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల స్వైర విహారం గురించి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక ప్రాథమిక పాఠశాలలో స్పందన 5వ తరగతి చదువుతోంది. బోడిరాజు, బంగారమ్మ దంపతులకు స్పందన ఒక్కతే సంతానం. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు కుక్కలు స్వైర విహారంలో ప్రాణాలు విడవడంతో చిన్నారి కుటుంబ సభ్యులు ఎంతగానో తల్లడిల్లి పోతున్నారు.

చిన్నారి స్పందన మృతితో దళ్లిపేట‌లో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి
విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ రైల్వే రిక్వెస్ట్ స్టేజి వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అరకు మండలం కొండవీధి గ్రామానికి చెందిన కళాసి కొర్ర నానాజి(32)గా గుర్తించారు. రైలు కింద పడటంతో శరీరం నుజ్జునుజ్జైపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడి మృతి
రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలోని నాదెండ్లలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలు పాలయ్యాడు. గుంటూరు జిల్లా గణపవరం జాతీయ రహదారిలోని స్పిన్నింగ్ మిల్లు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తాడేపల్లిగూడెంకు చెందిన చెల్లంకి దుర్గాప్రసాద్ (21) మృతి చెందాడు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన శివకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొందరు యువకులు గణపవరంలో నివాసముంటూ రోజూ స్పిన్నింగ్ మిల్లు పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్, శివ బైక్‌పై వెళ్తుండగా వేగంగా వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొట్టారు.

దీంతో దుర్గాప్రసాద్ తలకు బల మైన గాయమై అక్కడి కక్కడే మృతిచెందాడు. శివకు తీవ్ర గాయాలవడంతో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
10 Years Girl Dies From Dog Attack In Srikakulam District.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి