100శాతం ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్.. వైసీపీకి ఎన్నంటే.. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సెన్సేషన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈసారి ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సాధిస్తుందని కొందరు ,టిడిపి జనసేన బిజెపి కూటమి విజయం సాధిస్తుందని మరికొందరు బలంగా నమ్ముతున్నారు.
ఏపీలో ఫలితాల టెన్షన్
ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ విజయం దక్కించుకున్నా అన్ని పార్టీల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటుందని స్పష్టం చేశాయి. కొన్ని న్యూస్ చానల్స్, సర్వే సంస్థలు టిడిపి కూటమి విజయం సాధిస్తుందని లెక్క తేల్చితే, మరికొన్ని సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందని బల్లగుద్ది మరీ చెప్పాయి. ఈ క్రమంలో రేపు ఎన్నికల ఫలితాలపైన ఏపీలో టెన్షన్ పీక్స్ కి చేరుకుంది.

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ ట్వీట్
ఇదే సమయంలో వివాదాస్పద దర్శకుడు, ఏపీ రాజకీయాలపైన సంచల వ్యాఖ్యలు చేసే, టిడిపి అధినేత చంద్రబాబును టార్గెట్ చేసే రాంగోపాల్ వర్మ తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై తన అంచనాను చెప్పారు. 100% కచ్చితంగా కూడిన ఒక సర్వేను విడుదల చేస్తున్నానని ఆర్ జీ వి చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఒక నెటిజన్ ఆసక్తికర ఎగ్జిట్ పోల్
ఏపీ ఎన్నికల ఫలితాలపై సిరాశ్రీ అనే ఎక్స్ యూజర్ నా ఎగ్జిట్ పోల్ అంటూ చేసిన ఒక ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏపీ లోక్సభ ఎన్నికల ఫలితాలు అంటూ వేరువేరుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను రిలీజ్ చేసినట్టు ఓ వ్యక్తి చేసిన పోస్టును రిపోస్ట్ చేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
This has to be the MOST ACCURATE SURVEY 🙏🙏🙏 https://t.co/XllDH47M3X
— Ram Gopal Varma (@RGVzoomin) June 2, 2024
టీడీపీ కూటమి, వైసీపీ సీట్లు ఇవే
ఇక ఆ పోస్టులో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి కూటమి ఏదైనా సున్నా నుండి 175అసెంబ్లీ స్థానాలలో గెలవవచ్చని, అలాగే లోక్సభ విషయంలో కూడా టిడిపి కూటమి, వైసీపీ ఏదైనా సున్నా నుంచి 25 స్థానాలు గెలవచ్చంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఏ సర్వే అంచనా అయినా తప్పు అవుతుందేమో కానీ నా అంచనా మాత్రం 100% కరెక్ట్ అవుతుందంటూ ఓపెన్ ఛాలెంజ్ అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు.
అత్యంత ఖచ్చితమైన 100% నమ్మదగిన సర్వే
ఇక ఈ ట్వీట్ ను ఆర్జీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అత్యంత ఖచ్చితమైన 100% నమ్మదగిన సర్వే అంటూ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి కూడా స్పందన భారీగానే వస్తుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications