వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తస్మాత్ జాగ్రత్త: ఏపీలో 10వేల మంది చిన్నారుల్లో ఆ వ్యాధి లక్షణాలు, ప్రభుత్వం నివేదిక

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో ఫ్లోరోసిస్ వ్యాధి పిల్లలకు విస్తరించింది. ఫ్లోరోసిస్ సమస్య ఏపీకీ పెద్దగా లేదని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం నుంచి విడుదలైన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాగునీరు మరియు పారిశుధ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలు దేశంలో 7161 ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 261 ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ఉందని ప్రభుత్వం చెబుతోంది.

 10వేల చిన్నారుల్లో ఫ్లోరోసిస్ ఆనవాలు

10వేల చిన్నారుల్లో ఫ్లోరోసిస్ ఆనవాలు

ఇక ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10వేల మంది పిల్లల్లో ఫ్లోరిసిస్ ఆనవాలు గుర్తించడం జరిగిందని తాగునీరు మరియు పారిశుధ్య శాఖ విడుదల చేసిన సమాచారం ద్వారా తెలుస్తోంది. పిల్లల దంతాల్లో ఫ్లోరోసిస్ ఆనవాలు కనిపించినట్లు సమాచారం. మిగతా రాష్ట్రాల పిల్లలతో పోలిస్తే ఏపీలో ఫ్లోరిసిస్‌తో బాధపడుతున్న పిల్లల సంఖ్య తక్కువే అయినప్పటికీ... దేశంలోని తాగునీటిలో ఇంకా ఫ్లోరోసిస్ ఉందన్న చేదు విషయం మరవకూడదు. ఇక అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటకలో నివసించే పిల్లల్లో ఫ్లోరిసిస్ కేసులు ఎక్కువగా వెలుగు చూశాయి. ఈ సంఖ్య 4 లక్షలుగా ఉంది. వెస్ట్‌బెంగాల్, మధ్యప్రదేశ్‌లలో దంతాల ద్వారా వచ్చిన ఫ్లోరోసిస్ కేసులు బయటపడ్డాయి.

 ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది..?

ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది..?

ఫ్లోరోసిస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఫ్లోరోసిస్ సమస్య ఉన్న 19 రాష్ట్రాలను గుర్తించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాలు కూడా ఉన్నాయి. అవి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కృష్ణా చిత్తూరు, విశాఖపట్నం, మరియు శ్రీకాకుళం జిల్లాలున్నాయి. తాగునీరు మరియు పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖ మార్చి 22, 2017లో సురక్షిత తాగునీరు కార్యక్రమం ప్రారంభించింది. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఆ సమయంలో అంటే 2017-18కి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15.43 కోట్లు నిధులు విడుదల చేసింది. 2018-19కి రూ.10.1 కోట్లు నిధులు విడుదల చేసింది.

English summary
The problem of fluorosis still affects Andhra Pradesh. According to the data provided by the states under the Department of Drinking Water and Sanitation (DDWS), there are 7161 fluoride affected habitations in the country, out of which includes 261 habitations from Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X