పంజాబ్ సీఎం నిర్ణయంపై స్టార్ హీరోయిన్ తీవ్ర ఆగ్రహం!

పంజాబీ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి సోనమ్ బజ్వా.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వీధి కుక్కలను నివారించేందుకు ప్రభుత్వం చేపట్టబోయే ఓ వివాదాస్పద ప్రచారానికి వ్యతిరేకంగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మూగజీవాలకు మరణశిక్ష విధించడం ఎంతమాత్రం సరికాదని, జంతువుల పట్ల ఇలాంటి కఠినమైన శిక్షలు అమలు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేస్తూ.. మానవీయ కోణంలో పరిష్కారం కనుగొనాలని ముఖ్యమంత్రికి ఎమోషనల్ అప్పీల్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు పేరిట వీధి కుక్కల హతం?
ఈ వివాదానికి ప్రధాన కారణం గురువారం సీఎం భగవంత్ మాన్ చేసిన ఓ ట్వీట్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓ భారీ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించబోతోందని ఆయన ప్రకటించారు. అందులో భాగంగా రోడ్డుపై వెళ్లే దారిన పోయేవారికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రాణాంతకంగా మారిన వీధికుక్కలను ఏరివేసి, చంపివేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ట్వీట్ బయటకు వచ్చిన వెంటనే జంతు ప్రేమికుల నుంచి పర్యావరణవేత్తల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది.

Sonam Bajwa Slams Punjab CM Bhagwant Mann Over Stray Dog Campaign urging for a humane solution

అలా చెప్పలేదు.. కోర్టు ఆదేశాలను గుర్తుచేసిన నటి
సీఎం భగవంత్ మాన్‌ను ఉద్దేశిస్తూ సోనమ్ బాజ్వా తన నోట్‌‌లో సుప్రీంకోర్టు నిబంధనలను స్పష్టంగా గుర్తు చేశారు. వీధి కుక్కలను పెద్ద ఎత్తున చంపేయాలని లేదా పూర్తిగా తొలగించాలని సుప్రీంకోర్టు ఎక్కడా ఆదేశించలేదని ఆమె పేర్కొన్నారు.కేవలం సున్నితమైన ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాల నుంచి వాటిని క్రమబద్ధంగా తరలించాలని.. వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అందించాలని.. జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలని మాత్రమే న్యాయస్థానం చెప్పందని ఆమె స్పష్టం చేశారు. "అసలు మన రాష్ట్రంలో జంతు సంరక్షణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? దానికి తగ్గ మౌలిక వసతులు ఎక్కడ ఉన్నాయి? అలాంటప్పుడు ఈ క్యాంపెయిన్ మూగజీవాల పాలిట మరణశిక్షగా ఎలా మారుస్తారు?" అని సోనమ్ బాజ్వా నిలదీశారు.

సోనమ్ బాజ్వా ఎమోషనల్
సమాజంలో ప్రజల రక్షణ, మానవ ప్రాణాలు చాలా ముఖ్యమనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు సోనమ్ బాజ్వా వెల్లడించారు. అయితే అదే సమయంలో మూగజీవాల పట్ల దయ, బాధ్యత కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యమన ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సున్నితమైన అంశంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి పునరాలోచించాలని సోనమ్ బాజ్వా హృదయపూర్వకంగా కోరారు. ఎన్జీవోలు, పశువైద్యులు, స్థానిక పరిపాలన విభాగం, ప్రజా రక్షణ నిపుణులతో కలిసి ఓ మానవీయ, ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. "మనం మూగజీవాలతో ఎలా ప్రవర్తిస్తాం అనేదే.. ఒక సమాజంగా మనం ఎలాంటి వాళ్లమో చూపిస్తుంది" అంటూ సోనమ్ ముగించారు.

స్పందించని ముఖ్యమంత్రి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు
నటి సోనమ్ బాజ్వా నుండి ఇంతటి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కార్యాలయం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పంజాబ్ ప్రజలకు సాధారణంగానే వీధి కుక్కలు, జంతువుల పట్ల ఉండే దయాగుణాన్ని, వారు వాటికి ఆహారం అందించే దృశ్యాలను చూపిస్తూ ఓ కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. జంతువులను చంపడం కాకుండా, వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయడమే సరైన మార్గమని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+