బీఆర్ఎస్ కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్ - రేవంత్ పై శపథం..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో జమిలి లేకుంటే 2028 లో.. ఏపీలో 2029 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం. అధికారం నిలబెట్టుకొనేందుకు అధి కార పార్టీలు.. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు మద్దతుగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రశాంత్ కిషోర్. గతంలో ఐ ప్యాక్ నుంచి రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. 2014 లో ప్రధాని మోదీ విజయంలో.. 2019 లో ఏపీలో జగన్ గెలుపులోనూ కీలకంగా పని చేసారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనతోనూ సత్సంబంధాలు కొనాసాగించారు. ఆయన సేవలు అందిస్తారనే అంచనాల వేళ సొంత పార్టీతో బీహార్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. గతంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో స్టాలిన్ - మమతకు రాజకీయంగా సహకరించారు. వారి గెలుపుకు తోడ్పాటు అందించి న ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో సొంత పార్టీ గెలుపులో విఫలమయ్యారు. 2024 లో ఏపీలో టీడీపీకి సహకారం అందించారు. కీలకమైన వ్యూహాలతో కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్.. ఆ తరువాత బీహార్ కు పరిమితం అయ్యారు. కాగా.. ఇప్పుడు తిరిగి తెలంగాణలో బీఆర్ఎస్ కోసం పని చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

మోదీ కొత్త టీంలో తెలంగాణ నుంచి ఊహించని మార్పులు - ఇన్ .. అవుట్..!?
మోదీ కొత్త టీంలో తెలంగాణ నుంచి ఊహించని మార్పులు - ఇన్ .. అవుట్..!?
prasanth-kishor-likely-to-work-for-brs-targets-coming-assembly-elections-as-latest-reports

త్వరలోనే అధికారిక ఒప్పందం..!?

తెలంగాణలో కొద్ది రోజుల క్రితం కవిత కొత్త పార్టీ ఏర్పాటు వేళ ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహా లు ఇచ్చినట్లు ప్రచారం సాగింది. కాగా.. ఇప్పుడు బీఆర్ఎస్ తమ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ సన్నిహిత నేతలు చర్చలు చేసినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే బీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ కు మద్దతుగా పని చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నేనే స్వయంగా వచ్చి రేవంత్‌ను ఓడిస్తానని గతంలో బీహార్ ఎన్నికల సమయం లోనే ప్రశాంత్ కిశోర్ శపథం చేసారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ అడిగితే కాదనకుండా, రేవంత్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పీకే బీఆర్ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రశాంత్ కిశోర్ తాజాగా పాట్నా శివారులో బిహార్ నవనిర్మాణ్ ఆశ్రమంలో ఉంటున్నారు. బీఆర్ఎస్ కోసం పని చేయటం పైన అధికారికంగా రెండు వైపులా స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+