ఎండ ప్రచండం వేళ ఉపరితల ఆవర్తనం - 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో మరణాలు చోటు చేసుకొంటు న్నాయి. మరో అయిదు రోజులు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావారణ శాఖ వెల్లడించింది. దక్షణికోసతాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఇదే సమయంలో వర్షాల పైనా అప్డేట్ వచ్చింది. రుతుపవనాలు చురుగ్గా కదలటం.. ఉపరితల ఆవర్తనంతో మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్షాల పైన అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది. వీటి ప్రభావంతో ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

అగ్నిగుండం - వడదెబ్బతో ఒక్కరోజే 22 మంది మృతి, తాజా హెచ్చరికలు..!!
అగ్నిగుండం - వడదెబ్బతో ఒక్కరోజే 22 మంది మృతి, తాజా హెచ్చరికలు..!!
southwest-monsoon-is-expected-to-reach-telugu-states-between-june-5-and-june-10-according-to-foreca

వాతావరణ శాఖ తాజా అంచనాలు

రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కాగా.. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులకు అవకాశముంది. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని వెల్లడించారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+