హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ వేధింపులు తట్టుకోలేక పదో తరగతి విద్యార్ధిని గాయత్రి ఆత్మహత్య

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమిస్తున్నానని వెంటబడ్డారు.. ప్రేమించమని వేధించారు.. అంతటితో ఆగకుండా ఫోన్ చేసి వేధించారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మందలించారు. అయినా సరే ఆకతాయిల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాప చెందిన బాలిక బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని లక్ష్మీగూడ హౌజింగ్‌ బోర్డు కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.... కాలనీకి చెందిన షేర్‌సింగ్‌ యాదవ్‌, పుష్ప భార్యాభర్తలు. పూల వ్యాపారం చేసే వారికి నలుగురు సంతానం. పెద్ద కుమార్తె గాయత్రి(16) శాంతినగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదేకాలనీకి చెందిన ఇద్దరు అబ్బాయిలు ఎనిమిది నెలల నుంచి తమను ప్రేమించాలంటూ గాయత్రి వెంటపడ్డారు.

బాలిక కుదరని చెప్పడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో రెండు నెలల క్రితం ఆ ఆకతాయిలను మందలించారు. అయినా సరే ఆకతాయిల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. బాలిక తల్లిదండ్రులకు చెప్పిందన్న కారణంతో మంగళవారం ఆమెపై మరోసారి వేధింపులకు పాల్పడ్డారు.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గాయత్రి బుధవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు.. బంధువుల ఫిర్యాదు మేరకు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాలిక తరుపు బంధువులు కోరుతున్నారు.

 10th class girl commits suicide due to love harassment at rajendranagar

నరేశ్ అనే యువకుడు తమ కుమార్తెను వేధించాడని గాయత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో పోలీసులు వ్యవహారిస్తున్న తీరుపై గాయత్రి బంధువులు విమర్శిస్తున్నారు.

అయితే పోలీసులు మాత్రం తల్లిదండ్రులు మందలించడంతోనే గాయత్రి ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. గాయత్రి మృతదేహంతో బంధువులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్టేషన్‌లోనే కూర్చొబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, విద్యార్ధిని మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రేమ పేరుతో చేసిన వేధింపులు భరించలేకే గాయత్రి ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఈ కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

English summary
10th class girl commits suicide due to love harassment at rajendranagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X