ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కృష్ణాలో ఎక్కువ, కర్నూలులో తక్కువ, 14వేలకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు సంఖ్య భారీగా పడిపోయింది.

ఏపీలో కొత్తగా 1121 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1121 కరోనా కేసులు

గత 24 గంటల వ్యవధిలో 71,913 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1121 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా మహమ్మారి బారినపడి 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6938కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు కరోనాతో మరణించగా.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

14వేలకు యాక్టివ్ కేసులు

14వేలకు యాక్టివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో 1631 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 8,41,026 మంది కోలుకుంటున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 14,249 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 96,15,090 నమూనాలను పరిక్షీంచినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు

ఇక జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 46, చిత్తూరులో 130, తూర్పుగోదావరిలో 134, గుంటూరులో 164, కడపలో 60, కృష్ణాలో 167, కర్నూలులో 21, నెల్లూరులో 26, ప్రకాశంలో 64, శ్రీకాకుళంలో 67, విశాఖపట్నంలో 77, విజయనగరంలో 23, పశ్చిమగోదావరిలో 142 కేసులున్నాయి.

Recommended Video

    #Telangana : తెలంగాణలో Corona సెకండ్ వేవ్ అవకాశాలు.. రాజధాని Hyderabad లో వైరస్ ఉధృతి!
    దేశంలోనూ తగ్గుముఖం పట్టిన కరోనా..

    దేశంలోనూ తగ్గుముఖం పట్టిన కరోనా..

    మరోవైపు దేశంలోనూ కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 91,07,058కు చేరింది. 85,30,224 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,33,380 కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,41,398 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులతోపాటు మరణాలు కూడా తగ్గుతూ వస్తుండటం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+