ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: 14వేల దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కొత్తకేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 1000కిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 49,737 నమూనాలను పరీక్షించగా.. 1179 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1179 కరోనా కేసులు, 11 మంది మృతి

ఏపీలో కొత్తగా 1179 కరోనా కేసులు, 11 మంది మృతి

తాజాగా నమోదైన 1179 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,40,708కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 11 మంది మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురు మరణించగా, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,089కి పెరిగింది.

ఏపీలో 13,905 యాక్టివ్ కేసులు

ఏపీలో 13,905 యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1651 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,12,714కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 13,905 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,78,13,498 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 192 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో 01 కొత్త కరోనా కేసు నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 08, చిత్తూరులో 190, తూర్పుగోదావరిలో 192, గుంటూరులో 107, కడపలో 30, కృష్ణాలో 167, కర్నూలులో 02, నెల్లూరులో 131, ప్రకాశంలో 124, శ్రీకాకుళంలో 19, విశాఖపట్నంలో 47, విజయనగరంలో 01, పశ్చిమగోదావరిలో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,89,626, చిత్తూరులో 2,42,377 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,679) కరోనా కేసులున్నాయి.

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలోనూ కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, 30వేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా 300కు దిగువనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 14,13,951 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,115 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్ల చేరింది. ఆదివారం 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.45లక్షలకు పెరిగింది. ఆదివారం 34వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.27కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.75 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3.09 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.92 శాతానికి తగ్గింది. ఆదివారంనాడు 96,46,778 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 8.85 కోట్లకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+