కాల్ మనీ పేరుతో ఘరానా మోసాలు, లైంగిక వేధింపులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. కాల్ మనీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. ప్రతి రోజు నగరంలో కోట్ల రూపాయలతో కాల్ మనీ వ్యాపారం చేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచరాం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
కాల్ మనీ సభ్యులు రోజువారీ వడ్డీగా 10 నుంచి 25 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మఠు అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇవ్వడమే కాకుండా బాధితులపై లైంగిక వేధింపులకు పాల్పుడుతున్నట్లు పోలీసులు గుర్తిచారు.

వేధింపులు అధికం కావడంతో బాధితులు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాల్ మనీ ముఠా రోజుకు కోట్లలో టర్నోవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోసంలో నగరంలోని బడా వ్యాపారవేత్తల పాత్ర కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.
విలువైన డ్యాక్యుమెంట్లను సీజ్ చేసి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications