Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో తగ్గినా కరోనా కేసులు: ప్రకాశంలో అత్యల్పం, పశ్చిమగోదావరిలో అధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య ఎనిమిదిన్నర లక్షలకు చేరింది.

గత 24 గంటల్లో 69,618 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1236 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,54,500కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 9 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6899కి చేరింది. కరోనా బారినపడి చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు మరణించారు.

1236 new corona positive cases reported in Andhra Pradesh and 9 deaths

ఒక్కరోజులో వ్యవధిలో 1696 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 8,31,085కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,516 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీ జిల్లాల వారీగా కరోనా కొత్త పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 49, చిత్తూరులో 157, తూర్పుగోదావరి 155, గుంటూరులో 181, కడపలో 60, కృష్ణాలో 194, కర్నూలులో 26, నెల్లూరులో 38, ప్రకాశంలో 24, శ్రీకాకుళంలో 51, విశాఖపట్నంలో 53, విజయనగరంలో 28, పశ్చిమగోదావరిలో 220 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలోనూ కరోనా పాజటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89,13,642కు చేరింది. 83,33,096 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,31,047 కరోనా బారినపడి మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,47,496 యాక్టివ్ కేసులున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+